
ఏడుగురు స్పెషలిస్ట్ వైద్యులు, ఎనిమిది మంది డాక్టర్లు, 98 సిబ్బంది ఆద్వర్యంలో ఆరోగ్య సర్వే
ఆరోగ్య పరిస్థితి పై సమగ్ర డేటా సేకరణ
శని ఆదివారాల్లో ఇంటింటి సర్వే ద్వారా క్యాన్సర్ లక్షణాలు ఉన్నవారినీ గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది
లక్షణాలు ఉన్నవారికి మెరుగైన వైద్య చికిత్స
క్యాన్సర్ కేసుల నమోదు నేపధ్యంలో బలబద్రపురం గ్రామంలో పర్యటించిన…
కలెక్టర్ పి.ప్రశాంతి
త్రినేత్రం న్యూస్, బలభద్రపురం
బలభద్రపురం లో ఇంటింటి సర్వే ద్వారా క్యాన్సర్ లక్షణాలు ఉన్నవారినని గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం, అంకాలజిస్టు సూచనలు సలహాలు మేరకు తగిన వైద్య చికిత్స అందజేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి పేర్కొన్నారు
శనివారం అనపర్తి మండలం బలభద్ర పురం గ్రామంలో జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పర్యటించి, క్షేత్ర స్థాయిలో తీసుకుంటున్న చర్యలపై విలేఖరులకు వివరించడం జరిగింది.
ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, బలభద్రపురం గ్రామంలో 2492 గృహాలలో సుమారు 10 వేల మంది జనాభా ఉన్నట్లు క్యాన్సర్ కేసుల నమోదు నేపధ్యంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులను అప్రమత్తం చేసి, ఇంటింటి సర్వే చేపట్టడం జరుగుతోందని వెల్లడించారు. ఇందుకోసం 31 బృందాలను నియమించామని, ప్రతి ఇంటికి వెళ్ళి వారి ఆరోగ్య వివరాలు సేకరించడం జరుగుతోందని వెల్లడించారు. అందులో భాగంగానే గ్రామస్థులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసు కోవడం జరుగుతోందని పేర్కొన్నారు. వారి అభిప్రాయాలను కూడా పరిగణన లోనికి తీసుకోవడం, అందుకు అనుగుణంగా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకూ సేకరించిన డేటా ఆధారంగా 23 మందికి క్యాన్సర్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు.
వారిలో వివిధ రకాలకు చెందిన క్యాన్సర్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. అంకలజిస్ట్ ల సూచనలు, సలహాలను అనుసరించి క్యాన్సర్ కేసుల గుర్తించి, తదుపరి వైద్య పరీక్షలను చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. దుర్బలమైన (vulnerable) ప్రాంతాలను గుర్తించి,, క్యాన్సర్ ప్రభావం ఉండడానికి గల కారణాలను తెలుసుకోవడం జరుగుతుందని, ఇందుకు సమన్వయ శాఖల ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్యశాఖ ప్రోటోకాల్ ను అనుసరించి వైద్య పరీక్షలు చేస్తున్నట్లు కలక్టర్ ప్రశాంతి తెలియ చేశారు. వైద్య ఆరోగ్య అందించే నివేదికలు ఆధారంగా క్యాన్సర్ కేసుల నమోదు కావడానికి గల మూల కారణాలను తెలుసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు.
వాతావరణ కాలుష్యం, కుటుంబ నేపథ్యం, వయస్సు రీత్యా, వ్యక్తిగత ఆరోగ్య స్థితి ఆధారంగా క్యాన్సర్ కేసుల నమోదు పై దృష్టి పెట్టడం జరుగుతుందని తెలిపారు. కాకినాడ రంగారాయ మెడికల్ కళాశాల నుంచి స్పెషలిస్ట్ వైద్యులు తీసుకుని రావడం జరిగిందనీ, అంకాలజిస్టు వారి సూచనలను అనుసరించి వైద్య పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. జిజిహెచ్, ఆరోగ్య సేవా, ప్రవేటు ఆసుపత్రులలో క్యాన్సర్ కీ చెంది ఈ గ్రామానికీ చెందిన వారు తమ వైద్య సేవలు పొందుతున్న వివరాలను కూడా సేకరిస్తున్నట్లు తెలియ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె.వెంకటేశ్వరరావు, కాకినాడ జిజిహెచ్ ఎస్పిఎం హెచ్ వో డి డా. పి సుజాత, 8 మంది వైద్యులు, 7 మంది స్పెషలిస్ట్ వైద్యులు, 31 టీమ్స్ సభ్యులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
