
Trinethram News : అలంపూర్:- జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయంలో పని చేసే సిబ్బంది ఇకపై సెల్ ఫోన్ వాడకుండా దేవస్థానం అందజేసిన వాకి టాకింగ్ ఉపయోగించాలని ఆలయ ఈఓ పురంధర్ కుమార్ శనివారం సూచించారు. దేవస్థానం అవసరాలు నిమిత్తం సిబ్బందికి తగు సమాచారాన్ని అందజేసేందుకు వాకీటాకీలని ఉపయోగించాలని సూచించారు
