TRINETHRAM NEWS

Trinethram News : ఆంధ్రప్రదేశ్ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) పిలుపు మేరకు రాజమండ్రి సెక్టర్ కార్యదర్శి వై.సునీత ఆధ్వర్యం లో ఐ సి డి ఎస్ ముందు ధర్నా ను ప్రారంభించారు.ఈ ధర్నా ను ఉద్దేశించి సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.ఉమామహేశ్వర రావు,సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు టీ.అరుణ్,జిల్లా కార్యదర్శి బి.పూర్ణిమ రాజు, ఎస్ ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి ఎన్..
రాజా మాట్లాడారు.సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.ఉమామహేశ్వర రావు మాట్లాడుతూ అంగన్వాడే వర్కర్స కు జీతాలు పెంచాలని,గ్రాట్యుటీ అమలు చేయాలని,మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లు గా మారుస్తూ జి . ఓ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మన రాష్ట్రంలో పేదగర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లలకు అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీవర్కర్లు, అనేక సేవలు అందిస్తున్నారు అని, అంగన్వాడీ సెంటర్ల నిర్వహణకు రకరకాల పెట్టుబడులు పెట్టి సెంటర్లు విర్వహిస్తున్నారు అని,పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 2019 నుండి అంగన్వాడీలకు వేతనాలు పెరగలేదు. అంగన్వాడీలకి వేతనాల పెంపు తదితర సమస్యల పరిష్కారం కొరకు 42 రోజుల పాటు చారిత్రాత్మక సమ్మె నిర్వహించారు సమ్మె ముగింపు సందర్భంగా అంగన్వాడీలకు 2024 జూలై లో వేతనాలు పెంచుతాము, ఇతర సమస్యలు పరిష్కారం చేస్తానని మినిట్స్ ఇచ్చారు. అయినా నేటి వరకు సమస్యలు పరిష్కారం కాలేదు. కావున ఈ క్రింది కోర్కెలు పరిష్కారంచేయాలని కోరుతూ ఫిబ్రవరి 17 వ తేదీ న రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టు ఆఫీసుల వద్ద ధర్నా చేస్తున్నా ర నీ
నూతన ప్రభుత్వం వెంటనేఅంగన్వాడీలకు కనీస వేతనం రూ.26000/-లు ఇవ్వాలిఅని,గ్రాట్యూటీ అమలుచెయ్యాలిఅని, రాష్ట్రంలో ఉన్న మొత్తం మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్పు చేస్తూ వెంటనే జీవో ఇవ్వాలిఅనిహెల్పర్లరప్రమోషన్లకు నిర్దిష్టమైన గైడ్లైన్స్ రూపొందించి అమలుచెయ్యాలిఅని, సంక్షేమ పధకాలు అంగన్వానీలకు అమలు చేయాలిఅని, సాధికారత సర్వేలో ప్రభుత్వ ఉద్యోగులు అనే పదాన్ని తొలిగించాలి అని,
సర్వీసులో ఉండి చనిపోయిన వారికి దహన సంస్కార ఖర్చులకు 20 వేలు, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి అని,సమ్మెకాలంలో చనిపోయిన వారికి కూడా అమలుచేయాలిఅని, పెండింగ్లో ఉన్న సెంటర్ అద్దెలు, టి బిల్లులు వెంటనే ఇవ్వాలి అని,అన్నియాపు లు కలిపి ఒకేయాప్ మార్పుచేయాలిఅని, పెండింగ్లో ఉన్న 164 సూపర్పైజర్ పోస్టులు వెంటనే భర్తీచేయాలి అని, మెనూచార్జీలు పెంచాలి. ఉచితంగా గ్యాస్ సరఫరాచెయ్యాలిఅని,వేతనం తో కూడిన మెడికల్ లీవ్ కనీసం 3 నెలలు ఇవ్వాలిఅని, ఫ్రీ స్కూల్ బలోపేతం చేయాలి.

ఫ్రీ స్కూల్ పిల్లలకు తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలి. 5 సంవవత్సరాల్లోపు పిల్లలందరూ అంగన్వాడీ సెంటర్లో ఉండాలని జీవోఇవ్వాలిఅని ఫ్రీస్కూల్ పిల్లలకు సాయంత్రం స్నాక్స్ ఇవ్వాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం లో సీఐటీయూ ఉపాధ్యక్షులు ఎస్.ఎస్.మూర్తి,బి.పవన్,డి.వై ఎఫ్.ఐ.కార్యదర్శి వి.రాంబాబు,అంగన్వాడీ యూనియన్ కోశాధికారి బి.రామ లక్ష్మి,బి.వి.వి.సత్యన్నారాయణమ్మ,కే.ప్రియాంక,ఎన్.రాజేశ్వరి ,సునీత తదితరులు పాల్గొన్నారు.

బి.పూర్ణిమ రాజు
సీఐటీయూ జిల్లా కార్యదర్శి,
రాజమండ్రి.
9393350423

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

CITU