TRINETHRAM NEWS

తేదీ: 27/12/2024.
గ్రామ రెవెన్యూ రైతు సభ.
చాట్రాయి: (త్రినేత్రం )న్యూస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఏలూరు జిల్లా, నూజివీడు అసెంబ్లీ నియోజవర్గం, చాట్రాయి మండలం, బూరుగు గూడెం
గ్రామ సచివాలయం నందు మీ భూమి- మీ హక్కు రైతు సరస్సు జరిగింది. భూమికి సంబంధించిన రైతులనుసర్వే నంబర్ లో గాని పేరు మార్పులో గాని , గత ప్రభుత్వంలో అవినీతికి ఎవరైనా పాల్పడినట్లయితే ఎవరి భూమి అయితే ఉందో వారికి చెందేలా ఈ ప్రభుత్వం మీ భూమి-మీ హక్కు పేరుతో న్యాయం చేస్తుందని రైతులకు రెవిన్యూ బృందం భరోసా ఇచ్చింది.

ఈ కార్యక్రమంలో రైతులు భూమికి సంబంధించిన ఆర్జీలను తీసుకుని తగు వివరాలతో పూర్తిచేసి రెవెన్యూ బృందానికి ఇచ్చినారు. వెంటనే రైతు భూమి సమస్యలకు పరిష్కారం అయ్యే దిశగా ఆర్జీలను పరిశీలించి న్యాయం చేస్తామని రెవెన్యూ అధికారులు, మరియు ఉమ్మడి కూటమి నాయకులు రైతులకు భరోసా ఇచ్చారు. కాసాల గోవర్ధన్ రెడ్డి, ముల్లంగి మహేష్, ఎల్లంకి శ్రీమన్నారాయణ, మద్దె నాగేశ్వరరావు , ములగాల సత్యనారాయణ ఎమ్మార్వో ప్రశాంత్ రైతు సదస్సు కార్యక్రమంలో పాల్గొన్నారు, అనంతరం సభకువచ్చిన ప్రతి ఒక్కరికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App