Plastic-Free : వికారాబాద్ జిల్లా ను ప్లాస్టిక్ రహిత జిల్లా గారూపొందించాలి

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : గురువారము అటవీ శాఖ అద్వర్యం లో ఎండింగ్ ప్లాస్టిక్ పోలుషన్ Ending Plastic Polution కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం కార్యక్రమం లో అయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూప్లాస్టిక్ అనేది నిత్య జీవితం లో బాగమై చివరకు మన ఆహరం లో మాక్రో ప్లాస్టిక్ రూపం లో చేరుతుందని , అది మన ఆరోగ్యం పై తీవ్ర ప్రబావం చూపుతుందని , ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తూ ప్లాస్టిక్ రహిత జీవన విధానం లోకి మారాలని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి కాపాడాలని,మొక్కలు నాటడం, పెంచడం జీవిత చర్యల్లో భాగం కావాలన్నారు.కాలుష్య మరియు ప్లాస్టిక్ రహిత జిల్లా గా ఏర్పాటు చేయాలనీ, సమాజంలోని ప్రతి వ్యక్తి పర్యావరణాన్ని కాపాడుతానని ప్రతిన బూనాలన్నారు.భవిష్యత్ తరాలకు మంచి పర్యావరణం అందించేందుకు మొక్కలు నాటి, వాటిని పెంచి కాపాడాలని పిలుపునిచ్చారు. త్వరలో అనంతగిరి ప్రాంతాన్ని ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా మారుస్తామన్నారు
అనంతగిరి అర్బన్ పార్క్ లో జరిగే అభివృద్ధి పనులను కలెక్టర్ ఈ సందర్బంగా పరిశీలించారు. పనులు తొందరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో జిల్లా అటవీ అధికారి జ్ఞానేశ్వర్, అటవీ రేంజ్ ఆఫీసర్ శ్యామ్ కుమార్, రాజేందర్, ప్రతిమ, అటవీ సెక్షన్ అధికారి అరుణ, ఉద్యాన్ కేర్ స్వచ్చంద సమస్త నిర్వాహకులు, విద్యార్థినులు మరియు సత్య సాయి సేవా ట్రస్ట్ వారు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Vikarabad district should be

You cannot copy content of this page

Scroll to Top