
రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీలోని మెన్ హాస్టల్ ను వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ, రాజమండ్రి కేంద్ర కారాగారం పర్యవేక్షణ అధికారి ఎస్. రాహుల్ తో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. విశ్వవిద్యాలయంలో విసి ఆచార్య ప్రసన్నశ్రీ ని కలిసిన కేంద్ర కారాగారం పర్యవేక్షణ అధికారి ఎస్ రాహుల్ తో విశ్వవిద్యాలయానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. తరువాత బాయ్స్ హాస్టల్ లోని వంట గదిని, విద్యార్థులు భోజనం చేసే మెస్ హాల్ ను పరిశీలించారు. వీసీ విద్యార్థులతో మాట్లాడి హాస్టల్ నిర్వహణ, మెస్ నాణ్యతపై ఆరా తీశారు. హాస్టల్ నిర్వహణ సిబ్బంది అందరూ నిబద్ధతగా పని చేయాలని, పరిశుభ్రంగా హాస్టల్ ను నిర్వహించాలని అన్నారు.
పరిశుభ్రత విషయంలో సిబ్బంది, విద్యార్థులు వ్యక్తిగత బాధ్యత వ్యవహరించాలన్నారు. హాస్టల్ మెస్ ను మరింత నాణ్యతగా ఏ విధంగా నిర్వహించవచ్చు అనే సూచనలను రాజమండ్రి కేంద్ర కారాగారం పర్యవేక్షణ అధికారి రాహుల్ తెలియజేశారు. కేంద్ర కారాగారంలో తాము తీసుకున్న కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను సూచించారు. హాస్టల్ విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలని, మంచిగా చదువుకొని ఉన్నతంగా జీవించాలని తెలియజేశారు. విశ్వవిద్యాలయానికి అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి తాము సిద్ధంగా ఉంటామని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ చీఫ్ వార్డెన్ ఆచార్య ఎస్.కె.శ్రీరమేష్ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
