Using Indian SIM cards, for cyber crimes from abroad
Trinethram News : బెంగళూరు
భారతీయ సిమ్ కార్డులను ఉపయోగించి, విదేశాల నుంచి సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారికి సహకరిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నానికి చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తిని కర్ణాటక రాష్ట్రం బెంగళూరు ఈశాన్య విభాగం సైబర్ క్రైం ఠాణా పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు.
సొంతంగా, ఏజెంట్ల ద్వారా వివిధ టెలికాం కంపెనీల సిమ్‌కార్డులు బెంగళూరు, చెన్నై, విశాఖపట్నం, ఇతర నగరాల నుంచి కొనుగోలు చేసి వియత్నాం, కాంబోడియాలకు కొరియర్ ద్వారా పంపించేవాడు. విదేశాల నుంచి సైబర్ వంచకులు ఈ సిమ్ కార్డులను ఉపయోగించుకుని వంచనలకు పాల్పడేవాడు.
మీకు పార్ట్‌టైమ్ ఉద్యోగాలు ఇస్తామని, యూట్యూబ్‌లలో వీడియోలకు లైకులు కొడితే డబ్బులు వస్తాయని, నమ్మించి, నిందితుడు వంచనలకు పాల్పడేవాడు. అరెస్టు చేసిన నిందితుడి నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు విచారణను తీవ్రం చేశారు. నిందితుడు శ్రీనివాసరావు పేరిట తైవాన్‌కు 24 సిమ్ కార్డులు పంపించేందుకు చేసిన పార్సిల్‌ను జప్తు చేసుకున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App