
తూర్పుగోదావరి జిల్లా, రాజమహేంద్రవరం డివిజన్. ధవళేశ్వరం లో ఘోర రోడ్డుప్రమాదం. జాలారుపేటకు చెందిన ఇద్దరు ప్రాణ స్నేహితులు అక్కడి కక్కడే మృతి చెందారు. ధవళేశ్వరం బ్యారేజి వద్ద నుంచి రాజమండ్రి వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు ను వెనుక నుంచి బైకు మీద వస్తున్న ఇద్దరు యువకులు బస్ ను ఓవర్ టేక్ చేయబోయి వెనుక టైరు క్రిందకు పడటం తో ఇద్దరు తలలు పగిలి అక్కడ అక్కడే చనిపోయారు. ఈ సంఘటన లో నాగమళ్ళ ముత్యాలు 19సం.లు , బొడ్డు వెంకటేష్ 16 సం.లు మృతి చెందారు. వారిద్దరూ ప్రాణ స్నేహితులు. ఈ యాక్సిడెంట్ ధవళేశ్వరం ప్రధాన రహదారి కాటన్ పేట సమీపంలో మంగళవారం మధ్యాహ్నం 3గంటలకు జరిగింది.
ధవళేశ్వరం ప్రధాన రహదారికి విస్తరణ జరుగక పోవడం తో కనీసం 15 అడుగుల వెడల్పు లేకపోవడం తో తరుచు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.
మృతి చెందిన ఇరువురు యువకులు చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు, పక్క పక్కనే ఇళ్ళు కూడా.
యాక్సిడెంట్ జరగడం తో మొత్తం జాలారుపేట,వాడపేట వాసులు ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ధవళేశ్వరం చేరుకొని మృతుల కుటుంబాలను అన్నివిధాల ఆదుకుంటామని, వారికి భరోసా ఇచ్చారు. ధవళేశ్వరం సి.ఐ. గణేష్ నేతృత్వంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
