31న టీటీడీ బోర్డు అత్యవసర సమావేశం
Trinethram News : Andhra Pradesh : ఏపీలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆధ్వర్యంలో ఈనెల 31న పాలకమండలి అత్యవసరంగా సమావేశం కానుంది. రథసప్తమి సందర్భంగా ఏర్పాట్లపై టీటీడీ సభ్యులు, అధికారులతో పాలక మండలి సమీక్షించనుంది. భక్తులకు సౌకర్యాలపై అధికారులకు ఛైర్మన్ సూచనలు చేయనున్నారు. రథసప్తమి రోజున ఏడు వాహనాలపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. తిరుపతి ఘటన దృష్ట్యా అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App