
త్రినేత్రం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. 24/3/2025 . పర్యాటకులకు కనువిందు చేసేలా ముస్తాబు చేస్తున్న ట్రైబల్ మ్యూజియంలో గిరిజనుల కల్చర్ తో పాటు పండగలు మరియు వారి యొక్క పూజా విధానం సంబంధించిన దేవత మూర్తులను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నట్లు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు.
సోమవారం నాడు ఐటిడిఏ ప్రాంగణంలోని ట్రైబల్ మ్యూజియమును ఆయన సందర్శించి బాక్స్ క్రికెట్ సంబంధించిన నిర్మాణ పనులను మరియు ట్రైబల్ కు సంబంధించిన వివిధ ఆకృతులతో తయారు చేసే పెయింటింగ్ చిత్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మ్యూజియంలో గిరిజనులకు సంబంధించిన ఇలవేల్పులను వారి సాంప్రదాయ ప్రకారము ఏర్పాటు చేసి వాటి యొక్క చరిత్ర మరియు పూజా విధానము సంబంధించిన చరిత్రను పర్యాటకులకు అర్థమయ్యే రీతిలో తెలుగుతో పాటు వివిధ భాషలలో తయారు చేయించడం జరుగుతుందని, కోయ, నాయక్ పోడ్, కొండరెడ్లు, గోర్ బంజారా (లంబాడ) తెగల దేవత మూర్తులను ప్రత్యేకంగా సాంప్రదాయ పద్ధతిలో ప్రతిష్టించామని అలాగే గిరిజనుల జంతువులను వేటాడే పద్ధతి మరియు వారి ఇండ్లలో పాతకాలపు పనులు చేసుకునే విధానమునకు సంబంధించిన పెయింటింగ్ చిత్రీకరణ పనులు జరుగుతున్నాయని అన్నారు. మ్యూజియమునకు సంబంధించిన పనులన్నీ చాలా వరకు పూర్తి చేశామని అన్ని పనులు చివరి దశకు వచ్చాయని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, ఏపీవో పవర్ వేణు, డీఎస్ఓ ప్రభాకర్ రావు, డి ఈ హరీష్, టి ఏ శ్రీనివాసరావు, ఏ ఈ రవి, స్పోర్ట్స్ అధికారి గోపాలరావు, జేడియం హరికృష్ణ, మ్యూజియం ఇంచార్జ్ వీరాస్వామి మరియు సరస్వతి, సునంద తదితరులు పాల్గొన్నారు.
అదనపు పౌర సంబంధాల అధికారి కార్యాలయము భద్రాచలం నుండి జారీ చేయడం అయినది
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
