Trinethram News : గుంటూరు జిల్లా
20 మంది కానిస్టేబుళ్ల బదిలీలు…
జిల్లా లోని వివిధ పోలీసు స్టేషన్లలో పని చేస్తున్న 20 మంది పోలీసు కానిస్టేబుళ్లను బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు…
సుదీర్ఘకాలంగా ఒకే స్టేషన్లో పని చేస్తున్న వారితోపాటు కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు కారణంగా స్థాన చలనం చేయాలని విజ్ఞప్తి చేసిన వారిని బదిలీ చేశారు…
వారికి కేటాయించిన చోట వెంటనే విధుల్లో చేరాలని సూచించారు.