TRINETHRAM NEWS

ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇవ్వండి

కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు
Trinethram News : హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యం లో పోలింగ్ సిబ్బందిని నియమించు కోవాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.

జీపీలు, ఎంపీపీలు, జడ్పీల ఎన్నికల నిర్వహణకు సంబంధిం చి ఒక్క రోజు శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళి క రూపొందించాలని జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులకు సూచించిం ది. ఇప్పటికే హైదరాబాద్ లో ఎస్ఈసీ మాస్టర్ ఆఫ్ ట్రైనర్లు, స్టేట్ రిసోర్స్ పర్సన్‌లకు శిక్షణ నిర్వహించింది.

జిల్లాకు పది మంది చొప్పున ట్రైనర్స్ ఆఫ్ ట్రైన్సర్ (టీవోటీ)లు శిక్షణకు హాజర య్యారు. వీరు జిల్లాలోని రిటర్నింగ్ అధికారులతో పాటు పంచాయతీలు, మండల ప్రజా పరిషత్‌లు, జిల్లా ప్రజా పరిషత్‌ల పీవోలు, ఏపీవోలకు శిక్షణ ఇవ్వను న్నారు. అంతేకాకుండా, ఎన్నికల నిర్వహణకు రిటర్నింగ్ అధికారులు, ప్రిసైడింగ్ అధికారులు, ఇతర అధికారులు, బాధ్యులను నియమించాలని కోరింది. శిక్షణ పొందిన ట్రైనర్లతో జిల్లా, మండల, గ్రామస్థాయి పోలింగ్ సిబ్బందికి శిక్షణ ఇచ్చేలా ప్రణాళిక రూపొందించాలని ఆదేశించింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Train the election staff