
Trinethram News : హైదరాబాద్: టాలీవుడ్ నటుడు వేణు తొట్టెంపూడి ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి ప్రొఫెసర్ వెంకట సుబ్బారావు (92) సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన నివాసంలో విషాదఛాయలు అలముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఈ రోజు మధ్యాహ్నం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు.
