సంఘటనలు
1898: వివేకానందుని ప్రబోధాలతో ప్రభావితమై సిస్టర్ నివేదిత భారత్ వచ్చింది.
1933: ముస్లిముల ప్రత్యేక దేశానికి పాకిస్తాన్ అనే పేరుపెట్టాలని ప్రతిపాదించారు. పాకిస్తాన్ అంటే స్వచ్ఛమైన భూమి అని అర్థం.
1950: భారత సుప్రీంకోర్టు పనిచేయడం ప్రారంభించింది.
జననాలు
1865: పంజాబ్ కేసరి లాలా లజపతిరాయ్, భారత జాతీయోద్యమ నాయకుడు, రచయిత. (మ.1928)
1885: గిడుగు వెంకట సీతాపతి, భాషా పరిశోధకుడు, విజ్ఞాన సర్వస్వ నిర్మాత. (మ.1965)
1920: ‘జానపద బ్రహ్మ’ అని పేరు పొందిన తెలుగు సినిమా దర్శకులు, నిర్మాత బి.విఠలాచార్య జననం.
1929: రాజారామన్న, భారత అణు శాస్త్రవేత్త. (మ.2004)
1930: పండిట్ జస్రాజ్, హిందుస్తానీ శాస్త్రీయ సంగీతం, మేవాతి ఘరానాకు చెందిన భారతీయ శాస్త్రీయ సంగీత గాయకుడు.
1955: వినోద్ ఖోస్లా, ఇండియన్-అమెరికన్ వెంచర్ క్యాపిటలిస్ట్.
1986: శ్రుతి హాసన్ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటించిన నటి, గాయని. ఈమె నటుడైన కమల్ హాసన్ కూతురు.
మరణాలు
2014: బీరం మస్తాన్‌రావు, రంగస్థల కళాకారుడు, నట శిక్షకుడు, తెలుగు సినిమా దర్శకులు. (జ.1944)
2016: గౌరు తిరుపతిరెడ్డి, వాస్తునిపుణుడు (జ.1935)
2016: అరిందమ్ సేన్‌గుప్తా, ఆంగ్ల దినపత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ ఎడిటర్.
2022: ఎండ్లూరి సుధాకర్, కవి, పరిశోధకుడు, రచయిత. (జ.1959)