చరిత్రలో ఈరోజు జనవరి 11
Trinethram News : సంఘటనలు
1613: సూరత్‌లో వ్యాపారం చేసుకొనేందుకు అర్థించిన ఈస్టిండియా కంపెనీకి మొఘల్ చక్రవర్తి జహాంగీర్ అనుమతులిచ్చాడు.
1713: 9వ మొఘల్ చక్రవర్తిగా ఫర్రుక్‌సియార్ రాజ్యాధికారాన్ని చేపట్టాడు.
1922: మొదటిసారి చక్కెర వ్యాధి (డయాబెటిస్) రోగులకు ఇన్సులిన్ని ఉపయోగించారు.
1958: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏర్పడింది. 1932లోనే నిజాం ప్రభుత్వం సుమారు నాలుగు లక్షల రూపాయల పెట్టుబడితో 27 బస్సులూ 166 మంది సిబ్బందితో ట్రాన్స్పోర్ట్ సంస్థను నెలకొల్పినా అది నిజాంరైల్వేలో భాగంగా ఉండేది.
1960: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొట్ట మొదటి ముఖ్యమంత్రిగా నీలం సంజీవ రెడ్డి పదవీ విరమణ (1956 నవంబరు 1 నుంచి 1960 జనవరి 11 వరకు).
1960: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండవ ముఖ్యమంత్రిగా దామోదరం సంజీవయ్య ప్రమాణ స్వీకారం (1960 జనవరి 11 నుంచి 1962 మార్చి 29 వరకు).
జననాలు
1944 : భారతదేశంలోని జార్ఖండ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ జననం.
1970: సుకుమార్, తెలుగు చలన చిత్ర దర్శకుడు, రచయిత
1973: రాహుల్ ద్రవిడ్, భారత క్రికెట్ జట్టు క్రీడాకారుడు
1991: శ్వేతా బసు ప్రసాద్, భారతీయ చలనచిత్ర నటి
మరణాలు
1966: లాల్ బహాదుర్ శాస్త్రి, భారతదేశ రెండవ శాశ్వత ప్రధానమంత్రి. (జ.1904)
1983: భారతపారిశ్రామిక వేత్త, విద్యావేత్త ఘనశ్యాం దాస్ బిర్లా (జననం.1894)
2012: వీరమాచనేని మధుసూదనరావు, తెలుగు సినిమా దర్శకులు, ఫిలిం ఇన్ స్టిట్యూట్ స్థాపించి ఎందరో నటుల్ని తీర్చిదిద్దారు.
2016: పల్లెంపాటి వెంకటేశ్వర్లు, పారిశ్రామికవేత్త, కాకతీయ సిమెంట్స్ వ్యవస్థాపకుడు. (జ.1927)
2022: టీవీ నారాయణ, విద్యావేత్త, పద్మశ్రీ పురస్కారగ్రహీత. (జ.1925)
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App