TRINETHRAM NEWS

సానుకూలంగా స్పందించి కల్వర్ట్ మరియు రోడ్డు నిర్మించినందుకు ధాన్యవాదాలు

జిల్లా కలెక్టర్ కోరిన మద్దెల దినేష్ ..

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం నగర పాలక సంస్థలోని, మరియు ఓసిపి-5 . ప్రభావిత 33వ డివిజన్ లో ప్రజలు, కార్మికుల కుటుంబాలు అనేక సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జిల్లా కలెక్టర్ అదునపు కలెక్టర్ (లోకల్ బాడీస్) మరియు అర్జీ-1 జిఎం ఫైట్ ఫర్ బెటర్ సొసైటి ద్వార విన్నవించిన వెంటనే స్పందించి 33వ డివిజన్ లో ఇరుకుగా ఉన్న రొడ్డతో ఇబ్బందులు అవుతున్నాయని ఇంటినంబర్ 14-2-198 నుండి 14-2-138 వరకు నూతన రోడ్డు నిర్మించాలని కలెక్టర్ కోరిన వెంటనే సానుకుంగా స్పందించి రామగుండం నగర పాలక సంస్థలోని సంబంధించిన అధికారులకు ఆదేశాలు జారీ చేసి టెండర్ ద్వార రోడ్డు నిర్మించడం పట్ల స్థానిక డివిజన్ ప్రజలు కలెక్టర్ మరియు స్థానిక అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అదే విధంగా 33వ డివిజన్ లో మాజిద్ కంప్లెక్స్ దగ్గర పోచ్చమ్మ గుడిప్రక్కన శిలావస్థకు చేరిన కల్వర్ట్ ప్రమాదకరంగా మరితే అక్కడి స్థానిక చుట్టూ ప్రక్కల గల ప్రజలు అట్టి రహదారి కల్వర్ట్ పైనే నుండే వెళ్లాల్సి ఉంటుందని కావున సింగరేణి అధికారుల దృష్టికి మా వంతుగా అర్జీ వన్ జిఎం లలిత్ కుమార్ దృష్టికి తీసుకోని ఎలాంటి ప్రమాదం జరగకముందే త్వరితగతిన కల్వర్ట్ పునరనిర్మాణం చేపట్టాలని కోరిన వెంటనే జిఎం కార్మికుల కుటుంబాలు దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక నిధులు కేటాయించి నూతన కల్వర్ట్ నిర్మించడం పట్ల డివిజన్ ప్రజల పట్ల దినేష్ సింగరేణి అధికారులకు కృతజ్ఞతలు తెలియజేసారు.
అదే విధంగా రామగుండం నగర పాలక సంస్థ అధికారులు అయితే ప్రజల కట్టే పన్నులు మీద శ్రద్ద ఉందని పన్నులు కడుతున్న ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నా కనీసం ఇంగీత జ్ఞానం లెకపోవడం సిగ్గు చేటు అని ఆరోపించారు.
4 నుండి 5 ఫిట్ల వెడల్పు 100 నుండి 200 మీటర్లు వరకు ఉన్న రోడ్లు కూడ వేయలేని పరిస్థితిలో రామగుండం నగర పాలక సంస్థ ఉందా అని ప్రశ్నించారు.
రోడ్లు, పార్క్, బోరింగ్లు, కమ్యూనిటీ హాల్, ఓపెన్ జీమ్, మరియు వీధి లైట్లు, సోలర్ లైట్లు ఏర్పాటు చేయాలని రామగుండం నగర పాలక సంస్థ అధికారులను మరియు సింగరేణి అధికారులను దినేష్ డిమాండ్ చేశారు.
ఇంకా డివిజన్ సందర్శించిన వారిలో డివిజన్ యువత ఫైట్ ఫర్ బెటర్ సాసైటీ నిర్వాహకులు మండల శ్రీనివాస్, రేణికుంట్ల నరేంద్ర, విష్ణు, శ్రీనివాస్, రాజు, మల్లేష్, మహేష్, సురేష్ తో పాటు స్థానిక యువకులు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Maddela Dinesh requested Collector
Maddela Dinesh requested Collector