Three workers injured in Arg1, Gdk-2 incline due to neglect of protective measures –CITU
అర్జి1, బ్రాంచి అధ్యక్ష కార్యదర్శులు ఆరేపల్లి రాజమౌళి, మెండె శ్రీనివాస్
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
తేదీ 27:07:2024న Gdk-2 ఇంక్లైన్ సెకండ్ షిఫ్ట్ లో మూడవ సీమ్ 30వ లెవెల్ లో బండ కూలి, సంపత్, నోయల్, శంకర్ కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయని తెలిసిన వెంటనే సింగరేణి ఏరియా ఆసుపత్రికి సిఐటియు బృందం వెళ్లి పరదర్శించడం జరిగిందని, ఈ సందర్భంగా మాట్లాడుతూ
ఈ ప్రమాదం జరగడానికి రక్షణ అధికారుల నిర్లక్ష్యమే స్పష్టంగా కనబడుతునదని, రామగుండం రీజన్లో వరుస ప్రమాదాలతో కార్మికులు భయపడుతున్న పరిస్థితి ఉందని, కార్మికులకు రక్షణ కల్పించడంలో యాజమాన్యం విఫలం చెందిందని, ప్రమాదాలు జరిగిన ప్రతిసారి కిందిస్థాయి సిబ్బందిని సూపర్వైజర్లను ఇబ్బందులకు గురిచేస్తూ వారినే బాధ్యులను చేస్తూ, అధికారులు తప్పించుకుంటున్న పరిస్థితి ఉందని, నీ రక్షణ నీ బాధ్యత అంటూ కొత్త నినాదంతో కార్మికులకు రక్షణ కల్పించవలసిన అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు,
ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం అధికారులు కార్మికులకు రక్షణ కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని, పనిచేస్తున్న కార్మికులకు రక్షణ కల్పించలేని అధికారులను సస్పెండ్ చేయాలని, సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు డిమాండ్ చేస్తున్నదన్నాది, సింగరేణి యాజమాన్యం ఇప్పటికైనా అనుభవజ్ఞులైన సీనియర్ కార్మికులతో అన్ని కార్మిక సంఘాలతో పూర్తిస్థాయిలో సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేసి పటిష్టమైన రక్షణ చర్యలు చేపట్టాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు డిమాండ్ చేస్తున్నదన్నారు, ఈ కార్యక్రమంలో, ఉపాధ్యక్షులు అసరి మహేష్, పి సమ్మయ్య, దాసరి సురేష్, తాళ్ల శ్రీనివాస్, రాకేష్, సందీప్, నంది నారాయణ, తదితరులు ఉన్నారు, సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు రామగుండం1, బ్రాంచ్ కమిటీ,
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App