WhatsApp Image 2023 12 27 at 9.08.47 AM
ఆమదాలవలసలో ముగ్గురు అరెస్ట్
ఆమదాలవలస మండలంలోని కొత్తవలస గ్రామం సమీపంలో జరుగుతున్న పేకాట శిబిరంపై దాడి చేసి ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఆముదాలవలస ఎస్సై వై కృష్ణ తెలిపారు.
పేకాట జరుగుతున్నట్లు వచ్చిన సమాచారంతో సిబ్బందితో కలిసి పోలీసులు దాడి చేశారని అన్నారు. ఈ దాడిలో ముగ్గురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.2,200 నగదు స్వాధీనం చేసుకొని స్టేషన్ కు అప్పగించినట్లు తెలిపారు.
