Threatening.. Kishan Reddy fire on hydra demolitions
Trinethram News : హైడ్రాపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. అది హైడ్రానా?.. హైడ్రామానా? అంటూ దుయ్యబట్టారు. అప్పుడు అనుమతులు ఇచ్చి.. ఇప్పుడు కూల్చివేతలు ఏంటని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఏ ప్రభుత్వమైనా స్థలాలను కాపాడాలి.. కానీ, కూల్చివేతలు సరికాదన్నారు. రియల్టర్లను కాంగ్రెస్ ప్రభుత్వం బెదిరిస్తోందని కిషన్ రెడ్డి ఫైరయ్యారు.
కాగా.. హైదారాబాద్ లో అక్రమ కట్టడాలపై నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా ఏర్పాటు చేసింది. దీంతో నగరంలోని బఫర్ జోన్ లోని అక్రమ కట్టడాలను హైడ్రా నిర్ధాక్షణంగా కూల్చివేస్తోంది. ఈ క్రమంలో కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ ను కూడా హైడ్రా కూల్చివేసేందుకు సిద్ధమవ్వగా.. ప్రదీప్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించాడు.
ఫామ్ హౌస్ ను కూల్చివేయొద్దని పిటిషన్ లో కోరాడు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. హైడ్రా కూల్చివేతలపై వివరాలు అందజేయాలని ప్రభుత్వ లాయర్ ఆదేశించారు. డాక్యుమెంట్లన పరిశీలించి.. నిబంధనల ప్రకారమే హైడ్రా నడుచుకోవాలని సూచించింది. రేపటివరకు కూల్చివేతలు చేపట్టవద్దని ఆదేశించింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App