అన్నం పెట్టే రైతుల చేతులు సంకేళ్ల ఇది ప్రజా పాలన కాదు పోలీస్ పాలన
రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రైతుల చేతులు సంకేళ్లా ఇది ప్రజా పాలన కాదు పోలీస్ పాలన
లగచర్ల రైతులకు పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలి రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్ డిమాండ్ చేశారు. లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి, వారిపైన థర్డ్ డిగ్రీ ప్రయోగించి జైళ్లలో నిర్బంధించి, రైతన్నల చేతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ, అమానవీయ, అణిచివేత విధానాలకు నిరసనగా.. రైతన్నలపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేసి, వారిని వెంటనే విడుదల చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
లగచర్ల బాధితులకు న్యాయం చేయాలిని
రైతులపై పెట్టినా కేసులు ఎత్తి వేయాలి డిమాండ్ చేశారు. భూములివ్వని రైతులపై ధర్డ్ డిగ్రి… అక్రమ కేసులా అని ప్రశ్నించారు.రాష్ట్రం లో నిరంకుశ పాలన సాగుతోందని రైతు బతికే పరిస్థితి ఈ రాష్ట్రం లో లేదన్నారు. గిరిజన రైతులకు సంకేళ్లా సిగ్గు… సిగ్గని ఇది లూఠీ రాజ్యం లాఠీ రాజ్యమన్నారు. ఈ కార్యక్రమం లో మాజీ జడ్పీటీసీ ఆముల నారాయణ కార్పోరేటర్లు కుమ్మరి శ్రీనివాస్ గాధం విజయ నాయకులు బోడ్డుపల్లి శ్రీనివాస్ బోడ్డు రవీందర్ పర్లపల్లి రవి జిమ్మిబాబు నూతి తిరుపతి తోకల రమేష్ సట్టు శ్రీనివాస్ పిల్లి రమేష్ కుడుదుల శ్రీనివాస్ ముద్దసాని సంధ్యా రెడ్డి యాసర్ల తిమెాతి నిట్టూరి రాజు వడ్లూరి రాములు వెంకన్న అవునూరి వెంకటేష్ కనకలక్ష్మి గుంపుల లక్ష్మి స్వప్న తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App