
విజ్ఞతతో ఆలోచించండి… విజ్ఞాన వంతులకు పట్టం కట్టండి
ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపు
రాజమహేంద్రవరం : త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజ్ఞతతో ఆలోచించి విజ్ఞాన వంతుడైన పేరాబత్తుల రాజశేఖరానికి పట్టం కట్టాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపు నిచ్చారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి కూటమి అభ్యర్థిగా పోటీలో నిలిచిన పేరాబత్తుల రాజశేఖరం మంచి ఆలోచనపరులని, నిరుద్యోగుల సమస్యల పట్ల గళం వినిపిస్తారని పేర్కొన్నారు.
కూటమి అభ్యర్థి పేరాబత్తుల విజయమే లక్ష్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు. గ్రాడ్యుయేట్ ఓట్లను మనమే వెతుక్కుంటూ వెళ్లాల్సిన అవసరం ఉంటుందని, గత ఎన్నికలకు ముందు జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు సీట్లు మనం గెలుచుకున్నందునే.. సాధారణ ఎన్నికలు మనకు సులువయ్యి, ఇంతటి భారీ విజయాన్ని అందించి పెట్టాయని పేర్కొన్నారు. అదే విధంగా ఇప్పుడు జరిగే గ్రాడ్యుయేట్ ఎన్నికలను కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు.
క్లస్టర్ ఇంఛార్జిలు, డివిజన్ ఇంఛార్జిలు ప్రతి ఓటరుని కూడా ప్రత్యక్షంగా వ్యక్తిగతంగా కలిసి ఓటు వేసే విధంగా చూసుకోవాలన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం రేయింబవళ్లు శ్రమిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అదే మనం ఇచ్చే గౌరవం అన్నారు. ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబత్తుల గెలిచే వరకు ప్రతి కార్యకర్తా, నాయకుడు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
