TRINETHRAM NEWS

మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికుల జాయింట్ యాక్షన్ కమిటీ

తేదీ:15-02-2025 గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి . ఈరోజు మార్కండేయ కాలనీలోని లక్ష్మీ ఫంక్షన్ హాల్ లో జనరల్ బాడీ సమావేశం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా బి.ఆర్.టి.యూ. మున్సిపల్ యూనియన్ గౌరవ అధ్యక్షులు మురళీధర్ రావు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎ.ముత్యం రావు లు హాజరై మాట్లాడుతు రామగుండంలో పని చేస్తున్న మున్సిపల్ పారిశుద్ద కార్మికులపై అధికారులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు.

అంతే కాకుండా పనిముట్లు అయిన చీపుర్లు, పారలు, గంపలు, మరియు రక్షణ పరికరాలు అయిన చెప్పులు, మాస్కులు, గ్లౌజులు తో పాటు బెల్లం, సబ్బులు, కొబ్బరి నూనె ఇవ్వకుండా అధికారులు పనులు చేయించుకుంటున్నారని అన్నారు. ఇవి ఇవ్వాలని అంటే మీకు ఇష్టం ఉంటే పని చేయండి,లేదంటే పనులకు రాకండి అంటున్నారని అన్నారు. కమీషనర్ ట్రాన్స్ ఫర్ అయినప్పటికీ ఇప్పటివరకు కొత్త కమీషనర్ కార్పొరేషన్ కు నియమించలేదన్నారు. కమీషనర్ స్థానంలో వచ్చిన జిల్లా డిప్యూటీ కలెక్టర్ అరుణ కార్మికుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు.

కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరితే కనీసం వినడానికి కూడా ఇష్టం చూపడం లేదని అన్నారు. వారు తన విధానాన్ని మార్చుకోవాలని అన్నారు. అదేవిధంగా కార్మికులకు పండుగ మరియు జాతీయ సెలవులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పని చేసిన కార్మికులకు అన్ని ఏరియాల్లో వేతనాలు ఇచ్చారని కానీ రామగుండం మున్సిపల్ లో మాత్రం ఇప్పటి వరకు వేతనాలు ఇవ్వకపోవడం చూస్తుంటే కార్మికుల పట్ల అధికారులకు ఎంత నిర్లక్ష్యం ఉందో తెలుస్తుందని అన్నారు.
అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని అన్నారు. మోడీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను మార్చి 4 లేబర్ కోడ్లు తీసుకు వచ్చారని వాటిని ఏప్రిల్ ఒకటి నుంచి అమలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని వీటిని అడ్డుకోవాలని అన్నారు.
ఈ సమావేశంలో సీఐటీయూ మున్సిపల్ గౌరవ అధ్యక్షులు వై.యాకయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనగామ రాయమల్లు జిల్లా అధ్యక్షులు వేల్పుల కుమారస్వామి,నాయకులు కిషన్ నాయక్,రాదా కృష్ణ,నాగమణి,సారయ్య,సునీత,రామలక్ష్మి,పోసమ్మ,బోయిని రవీందర్,మంథని లింగయ్య,రాజేందర్, వేల్పుల రాయమల్లు, రూప,పద్మ, లత,లక్ష్మీ, లతోపాటు మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులు 300 మంది పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App