TRINETHRAM NEWS

ఫిబ్రవరి 1 నుంచి ఇవి మారనున్నాయ్

Trinethram News : ఫిబ్రవరి 1 నుండి ప్రత్యేక అక్షరాలు ఉన్న UPI లావాదేవీలకు పే,మెంట్స్ చేయలేరు. ఆల్ఫా-న్యూమరిక్ (అక్షరాలు, సంఖ్యలు) ఉన్న యూపీఐ IDలు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. వీటితో పాటు IMPS ద్వారా రోజుకు రూ.10 లక్షల వరకు నగదు బదిలీ చేసుకోవచ్చు.

  1. LPG సిలిండర్ ధర పెంపు
    ఎల్‌పిజి ధరలు దేశవ్యాప్తంగా ప్రతి నెలా మొదటి తేదీన సవరించబడతాయి. అందులో భాగంగా ఫిబ్రవరి 1 నుండి 14.2 కిలోల LPG సిలిండర్ ధర రూ. 50 పెరగనున్నట్లు తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో సబ్సిడీ పథకాలు కొనసాగుతుండగా, పట్టణ వినియోగదారులు పెరిగిన ఖర్చులు భరించాల్సి ఉంటుంది.
  2. UPI లావాదేవీల్లో భారీ మార్పు
    నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI).. UPI లావాదేవీల్లో భారీ మార్పులు చేపట్టింది. అందుకు సంబంధించి సర్క్యులర్ కూడా జారీ చేసింది. కొత్త నిబంధనల ప్రకారం.. ఫిబ్రవరి 1 నుండి UPI ఐడీలలో ప్రత్యేక అక్షరాలు ఉంటే అటువంటి వాటికి పేమెంట్స్ చేయలేరు. ఆల్ఫా-న్యూమరిక్ (A- to Z, 0- to 9) ఉన్న యూపీఐ IDలు మాత్రమే చెల్లుబాటు అవుతాయి.

Also Read :- బడ్జెట్ 2025 నుంచి ప్రధాన అంచనాలు
అలాగే.. NPCI.. యూపీఐ లావాదేవీ IDల కోసం బయోమెట్రిక్ OTP ప్రమాణీకరణను తప్పనిసరి చేస్తుంది. స్కామ్‌ల ప్రమాదాన్ని తగ్గించడమే దీని లక్ష్యం.

  1. IMPS పరిమితి పెంపు
    ప్రస్తుతమున్న రూ. 5 లక్షల పరిమితిని NPCI.. రూ. 10 లక్షలకు పెంచింది. దాంతో, ఫిబ్రవరి 1 నుండి IMPS ద్వారా రోజుకు రూ.10 లక్షల వరకు బదిలీ చేయవచ్చు. లబ్ధిదారుని పేరును పేర్కొనకుండా రూ. 7 లక్షల వరకు తక్షణ బదిలీలు చేయవచ్చు.
  2. పెరగనున్న మారుతీ కార్ల ధరలు
    దేశీయ అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సంస్థ.. పెరుగుతున్న ఖర్చులను దృష్టిలో ఉంచుకుని ఫిబ్రవరి 1 నుండి పలు మోడళ్లపై ధరలను పెంచాలని నిర్ణయించింది. Alto K10, S-Presso, Celerio, Wagon R, Swift, DZire, Brezza, Ertiga, Eeco, Ignis, Baleno, Ciaz, XL6, FrontX, Invicto, Jimny అండ్ Grand Vitara వంటి కార్లపై ఈ భారం ఉండనుంది.
  3. NPS ఉపసంహరణ 30 శాతం పెంపు
    పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ(PFRDA).. పెరుగుతున్న వైద్య ఖర్చులను దృష్టిలో ఉంచుకొని మెరుగైన ఆర్థిక సహాయాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో NPS కింద పాక్షిక ఉపసంహరణ పరిమితిని 30 శాతానికి పెంచుతూ సర్క్యులర్‌ను జారీ చేసింది.
  4. SBI హోమ్‌లోన్ ఇంట్రస్ట్ తగ్గింపు
    దేశీయ అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా(SBI).. ఫిబ్రవరి 2025 నుండి కొత్త గృహ రుణ పథకాన్ని ప్రారంభించింది. రుణగ్రహీతలు 8.4% నుండి 8.1% వరకు వార్షిక వడ్డీ రేటు తగ్గింపుతో రుణాలను పొందవచ్చు.

పైవాటితో పాటు పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులు జరిగే అవకాశం ఉంది. చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెలా మొదటి తేదీన ఎయిర్ టర్బైన్ ఇంధన ధరలను సవరిస్తాయి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App