రైతులకు ప్రపంచమంతా అండగా నిలవాలి: సీఎం రేవంత్రెడ్డి
దావోస్: సమాజానికి ఎంతో సాయం చేస్తున్న రైతులకు ప్రపంచమంతా అండగా నిలవాల్సిన సమయం వచ్చిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (Revanth Reddy) అన్నారు..
అన్నదాతలకు కార్పొరేట్ తరహా లాభాలు వస్తే ఆత్మహత్యలు ఉండవన్నారు. రైతులకు లాభాలు రావాలన్నది తన స్వప్నమని దావోస్లో వెల్లడించారు. ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో భాగంగా ‘ఫుడ్ సిస్టమ్ అండ్ లోకల్ యాక్షన్’ అనే అంశంపై రేవంత్ మాట్లాడారు..
”భారతదేశంలో వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో ఉంది. రైతుల ఆత్మహత్యలు అతిపెద్ద సమస్యగా మారాయి. బ్యాంకు రుణాలు రాక.. ఆధునిక సాంకేతిక పద్ధతులు అందుబాటులో లేకపోవడంతో రైతులు సరైన లాభాలు పొందలేకపోతున్నారు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన నేను వ్యవసాయ రంగంలో నెలకొన్న సమస్యలు అర్థం చేసుకోగలను. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం.. రైతు ప్రభుత్వం. అన్నదాతలకు నేరుగా పెట్టుబడి సాయం అందించేందుకు రైతు భరోసా కార్యక్రమం అమలు చేస్తున్నాం” అని తెలిపారు..