
Trinethram News : రాజానగరం:ఆదికవి నన్నయ యూనివర్సిటీ బాయ్స్ హాస్టల్ ను మంగళవారం ఉదయం వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ పరిశీలించి విద్యార్థులతో కలిసి టిఫిన్ చేశారు. విద్యార్థులతో మమేకమై అనేక విషయాలను తెలుసుకున్నారు. హాస్టల్ ను పరిశుభ్రంగా ఉంచుకోవాలని విద్యార్థులకు, సిబ్బందికి సూచించారు. తరువాత విశ్వవిద్యాలయానికి సిబ్బందిని, విద్యార్థులను తీసుకువచ్చే బస్సుల రికార్డులను తనిఖీ చేశారు. బస్సు మెట్టుపైనే కుర్చొని డీజిల్, మెయింటెనెన్స్ వంటి ఖర్చుల వివరాలను పరిశీలించారు. డ్రైవర్లు ఎంతో బాధ్యతగా వ్యవహరించాలని వందల మంది విద్యార్థుల ప్రాణాలు డ్రైవింగ్ పై ఆధారపడి ఉంటాయని అన్నారు.
డ్రైవర్లు నిత్యం అప్రమత్తంగా ఉండాలని, బస్సులను పూర్తి కండీషన్ లో నడపాలని సూచించారు. వెహికిల్స్ నిర్వహణ బాధ్యతను డిప్యూటీ రిజిస్ట్రార్ ఎస్.లింగారెడ్డికి అప్పగిస్తున్నామని చెప్పారు. అలాగే యూనివర్సిటీలోని సెక్యూరిటీ గార్డులతో వీసీ మాట్లాడారు. విశ్వవిద్యాలయ భద్రత అంతా సెక్యూరిటీ గార్డులపై ఆదారపడి ఉందని అన్నారు. అందరూ పూర్తి యూనిఫాంలో విధులకు హాజరు కావాలని, సెక్యూరిటీ నియమాలను పాటిస్తూ ఉద్యోగాలు నిర్వహించాలని తెలిపారు. అలాగే క్యాంపస్ లోని బేకరీ, క్యాంటీన్ లను సందర్శించి నాణ్యమైన ఆహార పదార్థాలను విద్యార్థులకు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య జి.సుధాకర్, డి.ఆర్. ఎస్.లింగారెడ్డి, ఇంజనీర్ డా.కె.నూకరత్నం, అధికారులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
