TRINETHRAM NEWS

ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై దుండగులు దాడి
జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ రంగారెడ్డి జిల్లా: ఫిబ్రవరి 09. చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై ఇంటిపై దాడికి పాల్పడ్డారు. వీర రాఘవ రెడ్డి అనే వ్యక్తి తన అనుచరులతో కలిసి వచ్చి దాడి చేశారు. ఇంట్లోకి చొరబడి తన అనుచరులతో కలిసి విచక్షణ హంగామా చేశాడు వీర రాఘవరెడ్డి. దీంతో ఈ ఘటనపై అర్చకులు రంగరాజన్ మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

క్రమంలో. నిందితుడు వీర రాఘవరెడ్డిని ఎస్వోటీ (SOT) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా..మూడు రోజుల క్రితం తెల్లవారుజామున వీర రాఘవరెడ్డి అనుచ రులు అర్చకులు ఇంట్లోకి చొరబడ్డారు. అంతేకాకుండా. రంగరాజన్‌పై దూషిస్తూ హల్చల్ చేశారు.కాగా. ఆలయం సమీపంలోని రంగరాజన్‌ నివాసానికి శుక్రవారం నాడు కొంత మంది వ్యక్తులు వచ్చారు. రామరాజ్య స్థాపనకు మద్దతు ఇవ్వాలని కోరారు.

అందుకు రంగరాజన్‌ నిరాకరించారు. రామరాజ్యం పేరుతో వచ్చిన వ్యక్తుల మాట నిరాకరించినందుకు తమ కుమారుడిని తీవ్రంగా హింసించారని. తనపైనా దాడి చేశారు. ఈ దాడికి పాల్పడిన వారితో పాటు పరోక్షంగా వారికి సహకరించిన వ్యక్తులను కూడా గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చిలుకూరు బాలాజీ ఆలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్ ఎంవీ సౌందర్ రాజన్ ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని అర్చకులు రంగరాజన్ తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

 attacked Rangarajan