TRINETHRAM NEWS

ముదురుతున్న ఎండలు…
కాచి చల్లార్చిన నీటి నే తాగాలి..

త్రినేత్రం న్యూస్:మండపేట. గతంలో ఎన్నడూ లేని విధంగా మార్చి లోనే మే ఎండలు తలపిస్తున్నాయి. మారిన వాతావరణం నేపథ్యంలో మండపేట లో పలువురు వాంతులు విరోచనాలు తో అనారోగ్యం పాలు అవుతున్నారు. మండపేట పట్టణ పరిధిలోని శెట్టి బలిజ రామాలయం ఏరియా, రావి చెట్టు, తెలుకుల పేట తదితర ప్రాంతాల్లో పదుల సంఖ్యలో రోగులు డయోరియా బారిన పడ్డారని స్థానికులు చెబుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి కి ఈ లక్షణాలతో వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది.ఇక ప్రైవేటు ఆసుపత్రులు, పి ఎంపి ల వద్ద భాదితులు క్యూ కడుతున్నారు. కడుపులో విపరీతమైన మంట, గ్యాస్, విరోచనాలు, వాంతులు తో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యం గా చిన్నారులు, వృద్దులు ఎక్కువ గా ఇబ్బంది పడుతున్నారని భాదితులు చెప్పారు.

కాగా మండపేట పురపాలక సంఘం ద్వారా సరఫరా అయ్యే రక్షిత మంచినీటి నీ తీసుకుంటున్నామని నీళ్లు తేడా తోనే డయోరియా వ్యాపించిందని కొందరు ఫిర్యాదు చేశారు. కాగా వాతావరణం మార్పు, ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల ఇబ్బందులు ఏర్పడుతాయని వైద్యులు చెపుతున్నారు. వేడి ఆహార పదార్థాలు మాత్రమే తీసుకోవాలని సూచించారు. ఖచ్చితంగా నీరు కాచి వడబోసి తాగాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.కాగా మండపేట లో మంచినీటి సరఫరా చేసే వాటర్ ట్యాంక్ ల పరిస్థితి అధికారులు పరీక్షించాలని నీరు కలుషితం పై వస్తున్న ఆరోపణలను పరిగణ లోకి తీసుకొని వెంటనే చర్యలు చేపట్టాలని ప్రజలు కోరారు. ఇక డ్రైన్ ల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు పెరిగి నీరు పారక దోమలు వ్యాప్తి విపరీతంగా వుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. మండపేట మసీదు కాంప్లెక్స్ వద్ద గల డ్రైన్ లో చెత్త చేదారాలు నిండి వున్నాయి. దుర్వాసన భరించలేని పరిస్థితి వుంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The threat of diarrhea