హైదరాబాద్: మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించడంపై సినీనటి, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి స్పందించారు. తెలుగుజాతి గౌరవానికి ప్రతీకగా నిలిచిన పీవీకి ఇలాంటి గౌరవం దక్కడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కు కూడా భారతరత్న ప్రకటించి ఉంటే తెలుగుజాతి మరింత పులకించిపోయి ఉండేదన్నారు. ఈ మేరకు ఆమె ‘ఎక్స్’(ట్విటర్)లో పోస్టు చేశారు. ఈ అంశాన్ని జాతీయస్థాయికి తీసుకెళ్లగలిగే పరిస్థితులు ప్రస్తుతం పుష్కలంగా ఉన్నాయన్నారు. ఈ బాధ్యతను భుజాలకెత్తుకొని, అందరి సంకల్పాన్ని సిద్ధింపజేసే ప్రయత్నం తప్పక జరుగుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. రాజకీయ పార్టీలన్నీ ఈ అంశాన్ని బలపరుస్తారని నమ్ముతున్నట్లు ఆమె తెలిపారు.
ఎన్టీఆర్ కు భారతరత్న ప్రకటిస్తే తెలుగు ప్రజానీకం పులకించిపోయేది
Related Posts
రైతు భరోసా గురించి సర్వే చేస్తున్న అధికారులు
TRINETHRAM NEWS రైతు భరోసా గురించి సర్వే చేస్తున్న అధికారులు.డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్.ఈ నెల 26 నుండి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతులకు రెండు పంటలకు గాను రూపాయలు 12000 రైతు భరోసా అందిస్తున్నందుకు ఆయా గ్రామాల్లో ఫీల్డ్ సర్వే నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్…
Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. ఢీకొన్న రెండు ట్రావెల్స్ బస్సులు
TRINETHRAM NEWS ఘోర రోడ్డు ప్రమాదం.. ఢీకొన్న రెండు ట్రావెల్స్ బస్సులు ఇద్దరు మృతి.. ఐదుగురికి గాయాలు Trinethram News : సూర్యాపేట జిల్లా : సూర్యాపేట జిల్లాలో హైదరాబాద్ – విజయవాడ 65వ జాతీయ రహదారిపై SV కళాశాల సమీపంలో…