
తేదీ : 20/02/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2024 సంవత్సరం లో ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడడం తుఫానుల వంటి పకృతి వైపరీత్యాలు సంభవించడం జరిగింది. తెలంగాణ , ఒడిశా, నాగాలాండ్ త్రిపుర రాష్ట్రాలకు ఆర్థిక సాయం అందనుంది.
పకృతి వైపరీత్యాలను ఎదుర్కొన్న రాష్ట్రాల ప్రజానీకానికి సాయం అందించడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం నిబద్ధతకు ఇది నిదర్శనం అని అమితేషా తెలిపారు.2024-2025 వ సంవత్సరంలో ఎన్ డి ఆర్ ఎఫ్ నుంచి 27 రాష్ట్రాలకు రూపాయలు 18,322.80 కోట్లు , 18 రాష్ట్రాలకు రూపాయలు 4,808.30 కోట్లు నిధులు కేంద్రం విడుదల చేయడం జరిగింది. ఐదు రాష్ట్రాలకు రూపాయలు 1,554.99 కోట్లు విడుదల చేశారు.
ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి రూపాయలు 608.08 కోట్లు విడుదల చేసామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి రూపాయలు 231 కోట్లు, త్రిపురకు 288.93 కోట్లు, ఒడిశాకు 255.24 కోట్లు, నాగాలాండ్ కు 170.99 కోట్లు రూపాయలను విడుదల చేసినట్లు ప్రకటించింది. ఇదంతా కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమితాషా అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీ సమావేశంలో జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
