TRINETHRAM NEWS

The services provided to the police department are excellent

రామగుండం పోలీస్ కమీషనరేట్

పోలీస్ శాఖ కి అందించిన సేవలు అమోఘం

కుటుంబ సభ్యులతో కలిసి జీవితం ఆనందంగా గడపాలి

అధికారులకు, సిబ్బందికి ఎల్లప్పుడూ అండగా ఉంటాం : పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్.,

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

పోలీస్ శాఖ నందు సుదీర్ఘ కాలం పాటు విధులు నిర్వర్తించి పదవీ విరమణ పొందిన ముగ్గురు ఎస్ఐ లను ఈరోజు రామగుండం పోలీస్ కమీషనర్ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన పదవీ విరమణ కార్యక్రమంలో రామగుండము పోలీస్ కమీషనర్ ఎం.శ్రీనివాస్ ఐపిఎస్., (ఐజి) పాల్గొని పదవీ విరమణ పొందుతున్న ముగ్గురు పోలీసు అధికారులను వారి కుటుంబ సభ్యుల తో కలిసి శాలువా, పూలమాలతో సత్కరించి జ్ఞాపిక అందచేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈరోజు పదవీ విరమణ పొందిన ఎం. రాజేంద్ర ప్రసాద్ సబ్ ఇన్స్పెక్టర్. 1981 సంవత్సరంలో పోలీసు డిపార్ట్మెంట్ లోకి కానిస్టేబుల్ గా ఎంపికై అంచలంచలుగా ఎదిగి 43 సంవత్సరముల 14 రోజులు విధులను నిర్వర్తించడం జరిగింది. దత్తు ప్రసాద్ శర్మ సబ్ ఇన్స్పెక్టర్ ,1982 సంవత్సరంలో పోలీసు డిపార్ట్మెంట్ లోకి కానిస్టేబుల్ గా వచ్చి అంచలంచలుగా సర్వీసులోని 41 సంవత్సరముల 11 నెలల, 8 రోజులు విధులను నిర్వర్తించడం జరిగింది.

అబ్దుల్ సత్తార్ ఎస్ ఐ, 1983 సంవత్సరంలో పోలీసు డిపార్ట్మెంట్ లోకి కానిస్టేబుల్ గా వచ్చి అంచలంచలుగా సర్వీసులోని 41 సంవత్సరముల 29 రోజులు విధులను నిర్వర్తించడం జరిగింది.

ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ గతంలో పోలీసు వ్యవస్థ అత్యంత క్లిష్ట పరిస్థితుల నందు సంఘవిద్రోహశక్తులతో పోరాడి కీలకంగా విధులను నిర్వర్తించి ప్రస్తుతం పోలీసు వ్యవస్థ ప్రశాంతంగా ఉండడానికి గల కారణమైన అధికారులకు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. సుదీర్ఘ కాలం పాటు పోలీసు వ్యవస్థను సేవలందించి పదవీ విరమణ పొందుతున్నందుకు ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలను పోలీసులు సక్రమంగా విధులను నిర్వర్తించడానికి కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎంతగానో ఉంటుందని వారి తోడ్పాటు వల్లనే విధులను నిర్వర్తించి ఉన్నత స్థానాలకు ఎదగగలరని తెలియజేశారు.

పదవీ విరమణ పొందిన తర్వాత వచ్చే ప్రయోజనాలను త్వరగా అందించాలని సిబ్బందికి తెలియజేశారు. పదవి విరమణ చేసిన మీరు ఇకపై కుటుంబ సభ్యులతో తమ శేష జీవితాన్ని ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఆనందంగా గడపాలని సూచించారు. తమ ఆరోగ్యాల పట్ల తగు జాగ్రత్తలను తీసుకోవాలని కోరారు. ఎటువంటి అవసరం ఉన్న కమీషనరేట్ పోలీసు వ్యవస్థ ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని హామీ ఇచ్చారు. పదవి విరమణ పొందిన అధికారులను ప్రభుత్వ వాహనంలో ఇంటి వరకు సాగనంపడం జరిగింది.

ఈ కార్యక్రమంలో అదనపు డిసిపి అడ్మిన్ సి.రాజు, గోదావరి ఖని ఏసీపీ రమేష్, పెద్దపల్లి ఏసిపి జి కృష్ణ మంచిర్యాల ఏసిపి ఆర్ ప్రకాష్, జైపూర్ ఏసిపి వెంకటేశ్వర్లు బెల్లంపల్లి ఏసిపి రవి కుమార్, టాస్క్ ఫోర్ సి ఏ సి పి మల్లారెడ్డి, సి సి ఎస్ ఏ సి పి వెంకటస్వామి, ట్రాఫిక్ ఏసిపి నరసింహులు, ఎఆర్ ఎసిపి ప్రతాప్, సురేంద్ర, ఏఓ అశోక్ కుమార్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ లు దామోదర్, మల్లేషం, శ్రీనివాస్, మధు, వామన మూర్తి, సూపరింటెండెంట్ లు ఇంద్ర సేనా రెడ్డి, సంధ్య, మనోజ్ కుమార్, సిసి పవన్ రాజ్, గౌస్ రామగుండం పోలీస్ కమీషనరేట్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు బోర్లా కుంట పోచలింగం, స్వామి, పదవి విరమణ అధికారుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The services provided to the police department are excellent