Trinethram News : బాపట్ల రూరల్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాపట్ల డిఎస్పీ వెంకటేశులు మాట్లాడుతూ ఈ కేసులో ఏ1 గా ఉన్న వినోద్ బాపట్ల టౌన్ నందు కార్ ట్రావెల్స్ నడుపుకుంటు ఉంటున్నాడు. అతని చిన్ననాటి స్నేహితుడు యాసిన్ అతను కూడా కారు డ్రైవింగ్ స్కూల్ పెట్టుకుని ఉంటున్నాడు సుమారు 1 సంవత్సరం నుండి రాహుల్ తేజ బాపట్ల టౌన్ పోలీసు స్టేషన్ క్రిమినల్ కేసుల్లో అరెస్టు కాకుండా తిరుగుతున్నాడు. వినోద్ బాపట్ల టౌన్ పోలీసులకు రాహుల్ తేజ గురించి సమాచారం ఇచ్చి పోలీసు వారికి పట్టిచారని, అప్పటి నుండి వినోద్ పైన రాహుల్ తేజ కోపంగా వున్నాడు. మరియు బాపట్లలో విజయ్ కృష్ణ సినిమా థియేటర్ మేనేజర్ ను, అలాగే ఉసిరికాయల శీను అనే లాయర్ ను కత్తితో పొడవుగా ఆ వార్తను విలేకరిగా పనిచేస్తున్న యాసిన్ న్యూస్ లో పోస్ట్ చేసినాడనే విషయాన్ని మనసులో
పెట్టుకుని యాసీన్ మీద సోనూ కక్షతో ఉన్నాడు . రాహుల్ తేజ, సోను, వెంకట సుమంత్ (మృతుడు) మంచి స్నేహితులు. అయితే వారిద్దరు రెండు గ్రూపులుగా ఏర్పడి బాపట్ల టౌన్ నందు తరచుగా గొడవ చేసుకుంటూ ఉండేవాళ్లు, అదే క్రమములో ది.06.02.2024 వ తేదీన వినోద్, యాసీన్ మరియు అతని స్నేహితులు, రాహుల్ తేజ, సోనూ మరియు సుమంత్ (మృతుడు) మరియు వారి స్నేహితులు మధ్యాహ్నం సుమారు 2.30 గంటల సమయములో అనుకోకుండా జి.బి.సి రోడ్డులోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వద్ద ఎదురెదురు పడి ఇద్దరు గ్రూపులవారు వాగ్వివాదం చేసుకుని, ఒకరినొకరు చంపుతాము అని బెదిరించున్నారు. అయితే అదే రోజు సాయంత్రం సుమారు 6.30 గంటలకు రాహుల్ తేజ, సోనూ, సుమంత్ మరియు అతని స్నేహితులు కలసి సూర్యాలంక రోడ్డులోని పందెంకోడి రెస్టారెంటులో ఉంది. బిర్యానీ తింటూ ఉండగా, వినోద్ మరియు యాసీన్ లు కలిసి వాళ్ళ దగ్గర బందువులను, టాక్సీ డ్రైవర్లను తీసుకుని వెళ్ళి రాహు తేజ, సోనూ, సుమంత్ (మృతుడు) ల మీద, వారి స్నేహితుల మీద కత్తులు, కర్రలతో దాడి చేయగా, రాహుల్ తేజ, సోనూ లు పారిపోగా వారి స్నేహితుడు అయిన వెంకట సుమంత్ వాళ్ళకి చిక్కగా, సుమంత్ ని అందరూ కలసి కర్రలతో కొట్టి, వినోద్ కత్తితో సుమంత్ ని పొడిచి చంపినాడు. ఈరోజు రాబడిన సమాచారం మేరకు ఏ 1 నుండి ఎ 11 లను సూర్యలంక రోడ్డు లోని చింతావారిపాలెం అడ్డరోడ్డు వద్ద అరెస్టు చేయడమైనది. మిగిలిన ఎ12 మార్పు డానియెలూ ను అరెస్టు చేయవలసి ఉన్నదని డిఎస్పీ వెంకటేశులు తెలిపారు. ఈ సమావేశంలో ట్రైని డిఎస్పీ, సీఐ, ఎస్సైలు, ఉన్నారు.
సుమంత్ ను హత్య చేసిన నిందితులను అరెస్ట్ చేసిన రూరల్ పోలీసులు
Related Posts
ఘనంగా వర్ధంతి
TRINETHRAM NEWS తేదీ:18/01/2025.ఘనంగా వర్ధంతితిరువూరు నియోజకవర్గం 🙁 త్రినేత్రం న్యూస్): విలేఖరి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట మండలంలో బస్టాండ్ సెంటర్ నందు సీనియర్ నందమూరి తారక రామారావు 29 వ వర్ధంతి నీ తెలుగుదేశం పార్టీ సీనియర్…
Tirumala : తిరుమలలో అపచారం
TRINETHRAM NEWS తిరుమలలో అపచారం Trinethram News : తిరుమల : కలియుగ దైవం కొలువైన తిరుమల కొండపై అపచారం జరిగింది. తమిళనాడుకు చెందిన కొందరు భక్తులు కొండపైకి కోడిగుడ్లు, మాంసాహార పలావ్ తీసుకొచ్చారు. రాంభగీచ బస్టాప్ వద్ద వారు ఈ…