TRINETHRAM NEWS

The ranks of the CITU started as a bike rally for the Peddapally District Collectorate dharna

తెలంగాణ బొగ్గు బ్లాక్ లను సింగరేణికే కేటాయించాలని డిమాండ్ చేస్తూ,

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

తెలంగాణ కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాల పిలుపుమేరకు, తెలంగాణలోని బొగ్గు బ్లాక్ లను సింగరేణి కేటాయించాలని డిమాండ్ చేస్తూ మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, చలో పెద్దపెల్లి జిల్లా కలెక్టరేట్ ధర్నా విజయవంతం కోసం, రామగుండం రీజన్లోని మూడు బ్రాంచిల కార్యకర్తలు బైక్ ర్యాలీగా బయలుదేరడం జరిగిందని, సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు రాష్ట్ర ప్రచార కార్యదర్శి మెండె శ్రీనివాస్ మాట్లాడుతూ, మూడోసారి అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం భారతదేశంలోని బొగ్గు గనులతో పాటు తెలంగాణలోని మంచిర్యాల జిల్లా శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ ను ఈ వేలం వేస్తున్నారని, సింగరేణి యాజమాన్యం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి బొగ్గు బ్లాక్ లను అన్వేషించినప్పటికీ సింగరేణి కేటాయించకుండా కేంద్ర బిజెపి మోడీ ప్రభుత్వం ఈ వేలం వేయటాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆఫీస్ కు బైక్ ర్యాలీగా బయలుదేరి ధర్నా నిర్వహించడం జరుగుతుందని, తెలంగాణ సాధన కోసం సకల జనుల సమ్మె చేసి తెలంగాణ సాధించుకున్న చరిత్ర సింగరేణి కార్మికులదని మా తెలంగాణ మా బొగ్గు మా గనులు మాకే ఇవ్వాలని డిమాండ్ చేశారు, అదే ఉద్యమ స్ఫూర్తితో మా బొగ్గు బ్లాకులు సింగరేణి కేటాయించే వరకు పోరాటం ఆపేది లేదని ఎంతటి పోరాటానికైనా అవసరమైతే సమ్మె కైనా సిద్ధం అయ్యి సాధించుకునే వరకు పోరాటం ఆపేది లేదన్నారు, కలెక్టర్ ఆఫీస్ ముందు మూడు గంటలు ధర్నా నిర్వహించి కలెక్టర్ గారికి వినతి పత్రం అందించడం జరిగిందన్నారు, ఈ కార్యక్రమంలో రామగుండం రీజన్లోని మూడు బ్రాంచిల అధ్యక్ష కార్యదర్శులు, ఆరేపల్లి రాజమౌళి, మెండె శ్రీనివాస్, వినయ్, కుంటా ప్రవీణ్ కుమార్, విజయ్ కుమార్ రెడ్డి, డి కొమరయ్య, ఈ కుమార్, రాష్ట్ర నాయకులు తోట నరహరి రావు, ఎస్ వెంకన్న, ఆసరి మహేష్, సానం రవి, దాసరి సురేష్, పి శ్రీనివాస్, వంగల శివరాంరెడ్డి, శంకరన్న, శివరామకృష్ణారెడ్డి, జంగాపల్లి మల్లేష్, నవీన్ కుమార్, చాగంటి యాదగిరి, వందమంది కార్యకర్తలు వెళ్లారు,

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The ranks of the CITU started as a bike rally for the Peddapally District Collectorate dharna