
ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్,( కొయ్యూరు ) జిల్లా ఇంచార్జ్ : అల్లూరిజిల్లా. కొయ్యూరు మండలం, తహసీల్దార్ కి, అల్లూరి జిల్లా వినియోగదారుల సంఘాల సమాఖ్య అధ్యక్షులు బూడిదే చిట్టిబాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ శెట్టిపల్లి రాజారత్నం, జాయింట్ సెక్రటరీ పాంగి భాస్కర్ రావు, మర్యాద పూర్వకంగా కలిసారు. చిట్టిబాబు మాట్లాడుతూ, వినియోగదారుల హక్కులు చట్టాల అవగాహన, మరియు ప్రతి మండల కేoద్రాల్లో విస్తృతంగా తనిఖీలు చేయయాలని, వస్తువులు కొనుగోలు చేసే ముందు వినియోదారులు, కొనుగోలు చేసే ప్రతి వస్తువు ఎంపిక చేసుకోవాలని, కొనుగోలు చేసిన వస్తువులో తప్పిదం, కల్తీ, తూనికల్లో మోసం ఉన్నట్లు తెలిస్తే నేరుగా ఆన్లైన్ లో కన్స్యూమర్ కోర్టుకు ఫిర్యాదు చేసుకోవచ్చన్నారు.
10 పైసలు మోసం జరిగిన పిర్యాదు చేయవచన్నారు, వ్యాపారాలు వినియోగదారులకు మోసాలు చేసినప్పుడు తహసీల్దార్ వారి దృష్టికి తీసుకోవచ్చినప్పుడు తహసీల్దార్ పూర్తి సహాయ సహకారాలు అందించాలని, ఎల్లప్పుడూ వినియోగదారుల సంఘాల నాయకులకూ సహకరించాలని ఆయన అన్నారు. కొయ్యూరు తహసీల్దార్ సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఈ కార్యక్రమo లోజిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శెట్టిపల్లి రాజారత్నం, జిల్లా జాయింట్ సెక్రటరీ పాంగి భాస్కర్ రావు రైతులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
