పండగకు ఊరెళ్తూ డోర్‌పై ఇంటి యజమాని నోట్.. నెట్టింట్లో వైరల్!
Trinethram News : Telangana : ‘‘మేము సంక్రాంతికి ఊరికి పోతున్నాం.. డబ్బు, నగలూ తీసుకుని వెళ్తున్నాం. మా ఇంటికి రాకండి.- ఇట్లు మీ శ్రేయోభిలాషి’’ అంటూ పేపర్‌పై రాసి ఓ ఇంటి యజమాని డోర్‌కు అంటించి మరీ వెళ్లాడు. ఈ దృశ్యం సోషల్ మీడియా కంట పడగా.. వైరల్‌గా మారింది.
సహజంగా పండగల వేళ నగరాల నుంచి సొంతూళ్లకు పెద్ద సంఖ్యలో ప్రజలు వెళ్తుంటూరు. ఇదే అదనుగా భావించి దొంగలు రెచ్చిపోతుంటారు. ఇలాంటి దొంగలకే షాక్ ఇస్తూ ఓ ఇంటి యజమాని ఈ రకంగా సందేశం పెట్టడం అందరినీ ఆకర్షించింది. ఈయనెవరో దొంగలకే లెటర్ రాశారంటూ.. పలువురు కామెంట్లు పెడుతున్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App