TRINETHRAM NEWS

The new committee of Pragati Nagar Colony Welfare Association is unanimous

త్రినేత్రం న్యూస్ జవహర్ నగర్ కాప్రా ప్రతినిధి

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా
కాప్రా మండలం జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతి నగర్ కాలనీ లో ఆదివారం రోజున కాలనీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్తి కాలనీవాసుల సమక్షంలో నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కమిటీ కాలనీ అభివృద్ధి కోసం సంబంధిత సమస్యల పరిష్కారం కొరకు పనిచేస్తుందని తెలిపారు. కాలనీ ప్రజల సమస్యలు ఏమి ఉన్నా కూడా కమిటీ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. నూతన కమిటీ అధ్యక్షులుగా చిన్నం బాలనరసింహ, ఉపాధ్యక్షులు ఆనందాస్ ప్రకాష్, జనరల్ సెక్రెటరీ ఖాతా శ్రీనివాస్, జాయింట్ సెక్రెటరీ బీరకాయల లక్ష్మిభాయ్, ఆర్గనైజర్ కార్యదర్శి నాగసముద్రం కుమారస్వామి, కోశాధికారి చుక్క యాదయ్య, సభ్యులుగా కడారి గణేష్, వాలి శివప్రసాద్, మాతంగి జోజి కుమార్, ఎం వీరభద్రరావు, టి శ్రీనివాస్, వెంకటేష్ గౌడ్, యు.పుణ్యవతి లుగా ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The new committee of Pragati Nagar Colony Welfare Association is unanimous