
Trinethram News : విశాలాంధ్ర,కాకినాడ, ఆంధ్ర రాష్ట్రంలో కృష్ణ గోదావరి బేసిన్లో సహజ వాయువు, చమురు, ఖనిజ సంపద కార్పొరేట్ సంస్థలు దోసుకుపోతున్నాయని కేంద్ర ప్రభుత్వ మాజీ సలహాదారు వై.వి.యన్ మహా దేవ్ ఆరోపించారు. కాకినాడ గాంధీ భవన్ నందు ఆదివారం చమురు సహజవాయువు, ఖనిజాలు మరియు ప్రకృతి వనరులపై ఆంధ్ర ప్రదేశ్ ప్రజల హక్కులను కాపాడేందుకు సదస్సును నిర్వహించడం జరిగింది. సభాధ్యక్షులు ఆలపాటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సభ నడిపించారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ఆంధ్ర ప్రాంత అభివృద్ధికి నిధులు కేటాయింపులు లేకుండా సహజ వనరులన్నీ పశ్చిమ ప్రాంతాలకు తరలించకపోతున్నారని ఆయన ఆవేదన చెందారు. ఆంధ్ర ప్రాంత వాసులకు ఉద్యోగ ఉపాధి లేకుండా రాష్ట్ర వనరులు తరలించకపోతున్నారని ఆయన పేర్కొన్నారు. 2018లో బ్లాస్ట్ జరిగి 22 మంది దుర్మరణం చెందిన వారికి నష్టపరిహారం అందలేదన్నారు. ఆంధ్రకు న్యాయబద్ధమైన వాటా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ సహజ సంపదపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి సిపిఐ పోరాటం చేస్తూ జీవన ప్రమాణాలు పెంచే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. ముఖ్య అతిథి వై.వి.ఎస్ మహాదేవ్ మాట్లాడుతూ కేజీ బేసిన్లో బొంబే హై కంటే చమురు నిలవలు అత్యధికంగా ఉన్నాయని, ప్రపంచంలోనే అతిపెద్ద చమురుక్షేత్రం ఆంధ్రప్రదేశ్లో ఉందన్నారు. కార్పొరేట్ సంస్థలు 60 లక్షల కోట్ల చమురు నిల్వలను పట్టుకెళ్ళి పోతున్నారని ఆవేదన చెందారు.
ఓపెన్ ఎకరా లైసెన్సింగ్ పాలసీ తో ప్రభుత్వాలు సహజ వనరులను కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నాయని సంవత్సరానికి రెండు లక్షల 50 వేల కోట్లు కార్పొరేట్ సంస్థలు తీసుకెళ్తున్నాయని తెలిపారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 38, 39 బి ప్రకారం సహజ వనరులు ఏ ప్రాంతంలో తీసిన ఆ ప్రాంత అభివృద్ధికి 30%
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
