The lives of many contract workers are hidden under the awards to NTPC
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
అవార్డుల ధ్యాసే తప్ప రక్షణ చర్యలపై ఎన్టిపిసి యాజమాన్యానికి శ్రద్ధ లేదు
IFTU రాష్ట్ర నాయకులు తోకల రమేష్, గుజ్జుల సత్యనారాయణ రెడ్డి
తేదీ:12:06:2024 రోజున బుధవారం ఉదయం 6:30. గంటలకు 6th యూనిట్ ESP Pass D దగ్గర పనిచేస్తున్న ఒడిసాకు చెందిన కార్మికుడు అర్జున్ మారండి 37సంవత్సరాలు అనే కార్మికుడు పనిచేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తుపై నుండి పడి అక్కడికక్కడే చనిపోయిన విషయం మీకు తెలిసిందే కావున ఇతని కుటుంబానికి ఎక్స్రేషియా 50 లక్షలు రూపాయలు ఇవ్వాలి.అలాగే దహన సంస్కారాల కింద లక్ష రూపాయలు ఇవ్వాలి.
అలాగే డెడ్ బాడి బీహార్కు ట్రాన్స్పోర్టింగ్ ఖర్చులు ఇవ్వాలిఅతని కుటుంబంలో ఎన్ టిపిసిసి లో కాంట్రాక్టు కార్మికునిగా లోకేషన్లో పని ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఎన్ టి పి సి యాజమాన్యానికి వస్తున్న గొప్ప గొప్ప అవార్డుల వెనుక కాంట్రాక్టు కార్మికుల ప్రాణాలు దాగి ఉన్నాయి అనే విషయం ఈ ఘటన ద్వారా రుజువు అవుతున్నది.
యాజమాన్యానికి అవార్డుల మీద ధ్యాసే తప్ప రక్షణ చర్యల అమలుపై లేదు. ఇప్పటికైనా ఎన్టిపిసి యాజమాన్యం జరుగుతున్న ప్రమాదాలపై చిత్తశుద్ధితో సమీక్ష నిర్వహించాలని బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకోవాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐ ఎఫ్ టి యు డిమాండ్ చేస్తున్నది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App