TRINETHRAM NEWS

తెలుగుదేశం పార్టి వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించిన, యం.వి.వి

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్, జిల్లా ఇంచార్జ్ : అల్లూరి జిల్లా, పాడేరు నియోజకవర్గం, కొయ్యూరు మండలం, రాజేంద్రపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, జి సి‌ సి మాజీ చైర్మన్ యం వి వి ప్రసాద్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంను ఉద్దేశించి యం వి వి ప్రసాద్ మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ పేదరిక నిర్మూలనకు అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిన యుగపురుషుడు అని, బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి పాటుపడిన నాయకుడు అని, గిరిజనుల కోసం ప్రత్యేకంగా ఐటీడీఏల స్థాపించారని, మరియు గురుకుల పాఠశాలలు స్థాపించారు.అని చెప్పారు.
ఈ కార్యక్రమంలో భాగంగా నిరుపేద, వృద్ధులకు చీరలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచులు మాకాడ బాలరాజు , జె. వెంకటలక్ష్మి , పి.సింహాచలం తెలుగుదేశం పార్టీ నాయకులు అప్పలరాజు, నాగేశ్వరరావు, బాసి, చంద్రరావు మరియు స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App