TRINETHRAM NEWS

Trinethram News : అమరావతి: వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జులకు సంబంధించి 6 జాబితాలను పార్టీ అధిష్ఠానం ఇప్పటికే విడుదల చేసింది. ఏడో జాబితా కోసం కసరత్తు నిర్వహిస్తోంది.
ఈ జాబితా నేడు విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. పలు అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో పార్టీ హై కమాండ్ మార్పులు, చేర్పులు చేసింది. రెండు రోజుల క్రితమే వైసీపీ ఆరో జాబితాను విడుదల చేసింది. 6వ లిస్టులో 10 మార్పులు జరిగాయి. ఆరో జాబితాలో 4 పార్లమెంట్, 6 అసెంబ్లీ ఇన్‌ఛార్జ్‌లు ఉన్నారు.

ఇక ఏడో జాబితాలో ఎంతమంది ఉంటారోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. నేడు ఈ ఏడవ జాబితా విడుదలయ్యే అవకాశం ఉండటంతో వైసీపీ నేతల్లో టెన్షన్ పెరుగుతోంది. ప్రస్తుతం సీఎం క్యాంపు కార్యాలయంలో ఏడవ జాబితాపై కసరత్తు కొనసాగుతోంది. కొద్ది సేపటి క్రితమే సీఎం క్యాంపు కార్యాలయానికి మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల్, మాజీమంత్రి పేర్ని నాని, నందిగామ సురేష్ చేరుకున్నారు. మిగిలిన ఎంపీ స్థానాలన్నింటిపై నేడు క్లారిటీ వచ్చే అవకాశమున్నట్టు తెలుస్తోంది. కాగా.. వైసీపీ అధిష్టానం మొత్తంగా 6వ లిస్టుతో కలిపి 82 స్థానాలకు సంబంధించి ఇన్‌ఛార్జ్‌లను మార్చేసింది.