బడి సమస్యల సుడి పీవీటీజీ విద్యార్దులకు కూటమి ప్రభుత్వము నిర్లక్ష్యం
అరకులోయ,త్రినేత్రం న్యూస్, స్టాఫ్ రిపోర్టర్, జనవరి 27.
అల్లూరి సీతారామరాజు జిల్లా,అరకువేలి మండలం,శిరగం పంచాయతీ,దిబ్బవలస గ్రామం.ఈ పీవిటీజి గ్రామనికి ఇప్పటి వరకు పాఠశాల కూడా పూర్తి కాలేదు. ఈ యొక్క స్కూల్ బిల్డింగ్ మొదలై 10 సంవత్సరాలు అవుతోంది గత ప్రభుత్వ హయంలో నాడు నేడు అని చెప్పి స్కూల్ పనులు మొదలుపెట్టి పూర్తి చేయకుండానే ఆపివేయడం జరిగింది .ఇప్పుడు స్వాతంత్ర్యం వచ్చి 76 సంవత్సరాలు అవుతోంది అయినా మా గిరిజన విద్యార్థులు పరిస్థితిలు మారడం లేదని 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎస్ఎఫ్ఐ మరియు గ్రామస్థులు పత్రిక ముఖంగా డిమాండ్ చేసారు.ఇప్పుడైనా కనీసం మా యొక్క సమస్యని గుర్తించి ఇక్కడ ఉన్న అధికారులు ఎంఈఓ, గాని పిఓ,అలాగే కలెక్టర్ స్పందించి మా యొక్క సమస్యని పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ మరియు గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
కనీసం స్కూల్ బిల్డింగ్ లేకుండా మా యొక్క పిల్లల్ని ఎక్కడికి చదువు కొరకు పంపించాలి ఎక్కడ స్థలం లేదు ఉన్న బిల్డింగ్ పూర్తి కాలేదని గ్రామస్థులు డిమాండ్ చేశారు.దీనిని వెంటనే ప్రభుత్వం స్పందించి పాఠశాలను పూర్తి చేయాలని కోరారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు ఎస్ ఐసుబాబు, గ్రామస్తులు సోడపల్లి దాసు, కొర్ర సుబ్బారావు, పాంగి శ్రీను,తదితరులు డిమాండ్ చేశారు.పరిస్కరించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటనీకి సిద్ధమని అన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App