TRINETHRAM NEWS

గిరి పుత్రులకు ఇచ్చిన హామీలు అమలులో కూటమి ప్రభుత్వం ముందంజ(సివేరి దొన్నుదొర)

అల్లూరిజిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ ఫిబ్రవరి 13 : అరకువేలి నియోజకవర్గ ఇన్చార్జ్, ఆర్టీసీ విజయనగరం రీజినల్ చైర్మన్ సివేరి దొన్నుదొర మాట్లాడుతూ, 1986 న‌వంబ‌ర్ 5న నాటి ఎన్టీఆర్, ప్రభుత్వం జీవో 275 ద్వారా 5వ షెడ్యూల్‌లోని 5(1) కింద ఉపాధ్యాయ పోస్టుల్లో స్థానిక ఆదివాసుల‌కే వంద శాతం ఇవ్వాల‌ని స్పష్టం చేసింది.
అయితే దీనిపై కొంత మంది న్యాయ‌స్థానాన్ని ఆశ్రయించడంతో కోర్టు తీర్పుకు అనుగుణంగా 2000 జ‌న‌వ‌రి 10న నాటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ప్రభుత్వం జీవో 275లో మార్పులు చేసి ఆదివాసుల‌కు వంద శాతం ఉపాధ్యాయ పోస్టుల భ‌ర్తీని స్పష్టం చేసేలా జీవో 3ను విడుద‌ల చేసింది.
అయితే దీనిపై కూడా కొంతమంది సుప్రీం కోర్టుకు వెళ్లగా, 2002లో సుప్రీం కోర్టు జీవో 3ను ర‌ద్దు చేసింది.
గిరిజన ప్రాంత యువతకు గుండెకాయలాంటి జీవో నంబర్‌ 3ను సుప్రీంకోర్టు కొట్టివేస్తే రివ్యూ పిటిషన్‌ వేయాల్సిన వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది.
షెడ్యూల్డ్‌ ప్రాంతంలో 100 శాతం ఉద్యోగాలు ఆదివాసీలకు దక్కడం జగన్‌కు, వైసీపీ వారికి ఇష్టం లేదు. గిరిజన ప్రాంత యువత _ముక్తకంఠంగా కోరినా జగన్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోలేదు, యువగళం పాదయాత్ర సమయంలో నారా లోకేష్ దృష్టికి జీ.వో: 3 అంశం తీసుకురాగానే పునరుద్ధరించడానికి కృషి చేస్తామని, న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడం జరిగింది.
ఇప్పటికైనా గిరిజన ప్రాంతంలో అన్నా వివిధ, పార్టీలు ప్రజల సంఘాలలో ఉన్నా నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా 1/70 ఎటువంటి మార్పు రాదు. మీరు సందేహం చెందవలసిన అవసరం లేదు. ఇది కేవలం రాజకీయ లబ్ధికోసం వైఎస్ఆర్సీపీ చేస్తున్నా బూటకపు రాజకీయం చేస్తుందని తెలిపారు. గత ప్రభుత్వంలో గిరిజన అనేక ప్రాంతంలో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ చింతపల్లి, అనంతగిరి మండలాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ తీయడానికి ప్రయత్నించలేదా.గత ప్రభుత్వం గిరిజనులకు ఏ అభివృద్ధి చేసింది.నేడు కూటమి ప్రభుత్వం, గిరిజన ప్రజల సంక్షేమం, అభివృద్ధి కొరకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. 1/70 చట్టంలో ఎటువంటి సవరణ,మార్పు ఉండదని తెలియజేస్తున్నాను. అని ప్రకటన చేశారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

WhatsApp Image 2025 02 12 at 18.30.09
Siveri Donnudora