TRINETHRAM NEWS

సమాచార హక్కు చట్టం అమలు కై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భాద్యత వహించాలి

హైదరాబాద్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

హైదరాబాదులోని మర్రి చెన్నారెడ్డి మానవ అభివృద్ధి వనరుల కేంద్రంలో సమాచార హక్కు చట్టంపై రెండవ రోజు శిక్షణ తరగతుల్లో పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు.ఈ కార్యక్రమంలో సమాచార హక్కు చట్టం శిక్షణా తరగతుల కోఆర్డినేటర్ శ్రీనివాస్ మాధవ్, ఫ్యాకల్టీ ఇన్ఛార్జ్ కె.సౌమ్య రాణి ఆధ్వర్యంలో విజయవంతంగా జరిగాయి, ప్రతి వినియోగదారుడు తన ఫిర్యాదును భారత ప్రభుత్వ ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చని అదేవిధంగా సుప్రీంకోర్టులో గాని తెలంగాణ హైకోర్టులో గాని వాటి వెబ్సైట్లలో బాధితులు సమాచారం చట్టం ప్రకారం తెలుసుకోవచ్చు అని తెలిపారు.

దేశం మొత్తం మీద మహారాష్ట్ర రాష్ట్రంలో ఈ సమాచార హక్కు చట్టం విజయవంతంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఒక మహారాష్ట్రలో మాత్రమే 8 మంది సమాచార హక్కు చట్టం కమిషనర్లను నియమించడం ఇక్కడ గొప్ప విషయం తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ సమాచార హక్కు చట్ట విషయంలో సరిగా అమలు చేయడం లేదని సమాచారం సరిగా కూడా ఇవ్వడం లేదని పాల్గొన్న వక్తలు ఈ సందర్భంగా తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. బీహార్లో ఫోన్ ద్వారా సమాచార హక్కు చట్టం జాన్కారి అనే వ్యవస్థ ద్వారా వివరాలు తీసుకుంటున్నారని ఇలాంటి విధానాన్ని తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలుపరచడానికి కృషి చేస్తే సమాచార హక్కు చట్టం ద్వారా బాధితులకు ఉపయోగపడుతుందని పలువురు తెలిపారు.

ప్రపంచంలోనే ప్రజలకు సంబంధించిన ప్రతి విషయము అనగా పన్నులకు సంబంధించి గాని, వ్యక్తిగత వివరాలు గానీ లాంటి అంశాలను ఇతర దేశాలైన నార్వే, స్వీడన్, పిన్ ల్యాండ్ లాంటి దేశాలు ప్రతి విషయాన్ని ప్రజలకు తెలియజేస్తూ బహిర్గతం చేస్తున్నాయి. అలాంటి పారదర్శకత ప్రభుత్వాలు పాలించక పోవడం మన దురదృష్టం..ఈ కార్యక్రమంలో సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు ఆళ వందార్ వేణుమాధవ్, రాళ్ల బండి రాజన్న, పెద్దపల్లి కోటిలింగం, మెరుగు రాజయ్య తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Right to Information Act