Trinethram News : Mar 19, 2024,
‘EV’లను కొనేవారికి కేంద్రం శుభవార్త
ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనాలనుకునేవారికి కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ నెలాఖరుతో ఫేమ్-2 పథకం ముగుస్తున్న తరుణంలో మరో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ పేరుతో తీసుకువచ్చిన ఈ పథకానికి రూ.500 కోట్లు కేటాయించింది. ఏప్రిల్ 1 నుంచి కొత్తపథకం అమలులోకి వస్తుందని కేంద్ర పునరుత్పాదక విద్యుత్ మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈ పథకం ఈ ఏడాది జూలై చివరి వరకూ అమలులో ఉండనుంది.