
గల్లంతైన ఐదుగురు యువకుల మృతదేహాలు లభ్యం…!!
Trinethram News : హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన ఏడుగురు యువకులు ఈ రోజు ఉదయం కొండ పోచమ్మ సాగర్ పర్యటనకు వెళ్లారు. అందులో కొందరూ రిజర్వాయర్ వద్దకు వెళ్లి ఈత కొడుతూ సెల్ఫీలు తీసుకునే ప్రభుత్వం చేశారు.
అయితే ఈ క్రమంలో ఆ యువకులు డ్యామ్ లోకి పడిపోయారు. అక్కడ ఉన్న స్థానికులు వారికి రక్షించేందుకు శక్తి వంచన లేకుండా ప్రయత్నించినప్పటికీ.. ఐదుగురు యువకులు నీటిలో గల్లంతయ్యారు.
మిగిలిన ఇద్దరినీ సురక్షితంగా బయటికి తీసుకురాగలిగారు. తాజాగా గల్లంతైన ఐదుగురు యువకుల మృతదేహాలను అధికారులు వెలికి తీశారు. దాదాపు 6 గంటల పాటు గాలింపు చర్యలు కొనసాగాయి. తొలుత దినేష్ మృతదేహం వెలికి తీయగా.. ఆ తరువాత ఒక్కొక్కరి మృతదేహాలను వెలికి తీశారు. చివరిగా లోహిత్ మృతదేహం వెలికి తీసేందుకు చాలా సమయం పట్టింది. మరణించిన వారు దినేష్, ధనుష్, జతిన్, లోహిత్, సాహిల్ గా గుర్తించారు. ఈ ప్రమాదం నుంచి మృగాంక్, ఇబ్రహీం బయటపడ్డారు. గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాలను పోస్ట్ మార్టం నిర్వహించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
