సింగరేణి కార్మికులకు సొంతిల్లు సాధించడమే సిఐటియు లక్ష్యం
ముఖ్యమంత్రి వినతి పత్రంపై సంతకాల సేకరణలో కార్మికులంతా పాల్గొనాలి
తుమ్మల రాజారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) జీడికే – ఓసిపి 5 పిట్ కమిటీ ఆధ్వర్యంలో ఉదయం ఏడు గంటలకు ఎస్కే గౌస్ అధ్యక్షతన గేటు మీటింగ్ జరిగింది, ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ, కార్మికులకు సొంతిల్లు సాధించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని సింగరేణి కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వానికి కార్మికులకు పైసా ఖర్చు లేకుండా సొంతిల్లు సాధించవచ్చని సందర్భంగా తెలియజేశారు, కార్మికునికి యజమాన్యం సొంత ఇల్లు అమలు చేస్తే, క్వటర్లకు మున్సిపల్ బిల్లులు తదితర అనేక మెయింటెనెన్స్ సంబంధించిన ఖర్చులన్నీ మిగులుతాయని, సొంతి ఇల్లు అమలు వల్ల క్వార్టర్ల మెయింటెనెన్స్ పై దృష్టి సారించకుండా, అధికారులు యాజమాన్యం నిర్దేశించిన ఉత్పత్తిపై దృష్టి సారించొచ్చని, అలాగే క్వార్టర్ తీసుకున్న కార్మికుడు పేరెక్స్క్స్ పై ఇన్కమ్ టాక్స్ చెల్లించకుండా మిగులుతుందని, మున్సిపల్ కార్పొరేషన్ రేట్ల ప్రకారం కంపెనీ చెల్లించే ఇంటికి కిరాయి వస్తుందని, యాజమాన్యం వడ్డీ లేని రుణం 30 లక్షలు చెల్లిస్తే నయ పైసా ఖర్చు లేకుండా ఇల్లు నిర్మాణం జరుగుతుందని తెలియజేశారు,
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్మిక సంఘం నాయకులు కార్మికులకు సొంతిల్లు అమలు చేస్తామని చెప్పిన వాగ్దానం నెరవేరుతుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కార్మికులు రక్తాన్ని చెమటగా మార్చు తెలంగాణ ఆర్థిక అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న కార్మికులకు సొంతిల్లు అమలు కోసం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా తీర్మానం చేసి అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మేదరి సారయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు తోట నరహరి రావు, అర్జి1, బ్రాంచి అధ్యక్ష కార్యదర్శులు ఆరెపల్లి రాజమౌళి, మెండె శ్రీనివాస్, విజయ్ కుమార్, ఉపాధ్యక్షులు ఎస్కే గౌస్, పిట్ కార్యదర్శి ఈద వెంకటేశ్వర్లు, ఎస్ శ్రీనివాస్, బి ప్రవీణ్, ఆడిచర్ల మల్లేశం, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు,
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App