
Trinethram News : పాకిస్తాన్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతున్న సమయంలో ఒక కీలక వార్త బయటకు వచ్చింది. ఈ టోర్నమెంట్ పై ఉగ్రవాద దాడి నీడలు అలుముకుంటున్నాయి. టోర్నమెంట్ మధ్యలో వచ్చిన ఈ నివేదిక సంచలనం సృష్టించింది.
ఎందుకంటే, ఈ టోర్నమెంట్‌లో ఇంకా చాలా మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ నివేదికలో ఉగ్రవాద దాడులతో పాటు, కిడ్నాప్‌లకు కూడా ప్రణాళికలు వేస్తున్నారని పేర్కొన్నారు. ఓ న్యూస్ ఛానల్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ఈ సమాచారాన్ని అందించారు. టోర్నమెంట్ పై ఈ ముప్పు పొంచి ఉందని పాకిస్తాన్‌తో పాటు, భారత నిఘా సంస్థలకు కూడా సమాచారం అందిందని ఆయన చెప్పారు.
పాకిస్తాన్‌లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీపై ISKP గ్రూప్ ఉగ్రవాద దాడికి ప్రయత్నించే అవకాశం ఉందని నిఘా సంస్థలకు సమాచారం అందింది. విదేశీ సంస్థలు కూడా భారత ఏజెన్సీలకు దీని గురించి సమాచారం ఇచ్చాయి. కిడ్నాప్ లేదా ఉగ్రవాద దాడి జరిగే అవకాశం ఉందని చర్చలు జరుగుతున్నాయని నివేదించింది.
ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్ (ISKP) దక్షిణ మధ్య ఆసియాలో, ప్రధానంగా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్‌లో చురుకుగా ఉన్న సలాఫీ జిహాదిస్ట్ గ్రూప్ ఇస్లామిక్ స్టేట్ ఒక శాఖ. దీని గురించి ఇప్పటివరకు ఎటువంటి ధృవీకరించని సమాచారం బయటకు రానప్పటికీ, ఇటువంటి ముప్పును తేలికగా తీసుకోకూడదు” అంటూ సమాచారం ఇచ్చింది.
భద్రతా కారణాలను చూపుతూ భారతదేశం పాకిస్తాన్ వెళ్లడానికి నిరాకరించిన సంగతి తెలిసిందే. దీని గురించి పాకిస్తాన్ మీడియాలో చాలా గొడవ జరిగింది. ఈ నిర్ణయంపై భారతదేశాన్ని విమర్శించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
