WhatsApp Image 2024 01 07 at 5.02.50 PM
Trinethram News : 7th Jan 2024
ఏపిలో స్కూళ్ళుకు ఎల్లుండి నుంచి పది రోజులు సెలవులు
అకడమిక్ క్యాలెండర్ ప్రకారం రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు ఈ నెల 9 నుంచి 18 వరకు మొత్తం 10 రోజుల పాటు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి.
సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్ని పాఠశాలల యాజమాన్యాలకు జిల్లా విద్యా శాఖాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
సెలవుల అనంతరం 19వ తేదీన పాఠశాలలు పున:ప్రారంభం కానున్నాయి.
కాగా, తెలంగాణలో జనవరి 12 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఇచ్చారు.
