రాబోయే వారం రోజులు జాగ్రత్త, తెలంగాణలో 15 డిగ్రీలకు పడిపోనున్న ఉష్ణోగ్రతలు, ఆ వ్యాధి ప్రబలే అవకాశం..!!
Trinethram News : Telangana : NOV 20 : తెలంగాణలో రానున్న వారం రోజులు 15 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు (Lowest Temperatures) నమోదుకానున్నాయని వాతావరణశాఖ హెచ్చరించడంతో ఆరోగ్యశాఖ పలు సూచనలు చేసింది.
శీతల సమయాల్లోనే ఇన్‌ఫ్లూయెంజా (Influenza) పంజా విసిరే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. జలుబు, జ్వరం, ఒళ్లు నొప్పులు ఇన్‌ఫ్లూయెంజా లక్షణాలుగా పేర్కొంది. ”ఇది సాధారణ వ్యాధి. కోలుకోవడానికి వారం రోజుల సమయం పడుతుంది. గర్భిణిలు, చిన్నపిల్లలు, వృద్ధులు, శ్వాస సంబంధిత ఇబ్బందులు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్యంగా ఉన్నవారికి దూరంగా ఉండాలి. సరైన నిద్ర, సరిపడా నీరు, పౌష్టికాహారం, చేతులు నిత్యం కడుక్కోవడం వల్ల ఇన్‌ఫ్లూయెంజా బారిన పడకుండా ఉండవచ్చు” అని వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App