
ఆంధ్రప్రదేశ్ అల్లూరిజిల్లా అరకు నియోజవర్గం అరకువేలి త్రినేత్రం న్యూస్ మార్చి 30 : తెలుగు ప్రజల స్థితిగతులు మార్చడంలో కీలక భూమిక పోషించిన పార్టీ తెలుగుదేశం అని ఆ పార్టీ అరకు నియోజకవర్గ ఇన్చార్జ్, ఏపీఎస్ఆర్టీసీ విజయనగరం జోన్ చైర్మన్ సియ్యారి దొన్నుదొర అన్నారు. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అరకులోని ఎన్టీఆర్ గ్రౌండ్ లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ముందుగా అరకు పట్టణం నుంచి ర్యాలీగా వెళ్లి ఎన్టీఆర్ గ్రౌండ్స్ లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం 43 ఏళ్ల తెలుగుదేశం పార్టీ కేకు ను కట్ చేసి పసుపు జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి సియ్యారి దొన్నుదొర మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవానికి ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ తెలుగుదేశం అని అన్నారు. తెలుగు ప్రజలు జీవన స్థితిగతులు మార్చడంలో కీలక భూమిక పోషించిందన్నారు. కాంగ్రెస్ నిరంకుశ పాలన నుంచి విముక్తి కల్పించిన పార్టీ తెలుగుదేశం అని పేర్కొన్నారు. ప్రజల్లో రాజకీయ సామాజిక చైతన్యం తీసుకొచ్చింది కూడా పసుపు జెండానేనని తెలుగువాడి సత్తాను ప్రపంచవ్యాప్తం చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని దొన్నుదొర పేర్కొన్నారు. మహిళలకు ఆస్తి హక్కు, ప్రభుత్వాన్ని ప్రశ్నించే చైతన్యం, ప్రజల వద్దకే పాలన, రెండు రూపాయలకే కిలో బియ్యం వంటి పథకాలను తీసుకొచ్చిన తెలుగుదేశమేనని ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తొలిసారిగా పేదలకు ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది తెలుగుదేశమేనని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది కూడా ఎన్టీఆర్ అని ఆయన పేర్కొన్నారు. రైతు బిడ్డలను కూడా ఐటీ ఉద్యోగులుగా మార్చి ప్రపంచ స్థాయికి పరిచయం చేసింది చంద్రబాబునాయుడు, తెలుగుదేశమేనని సైబరాబాద్ హైటెక్ సిటీ వంటివి నిర్మించి అనేకమందికి ఉపాధి కల్పించింది తెలుగుదేశం అని అన్నారు.మహిళల్లో ఆర్థిక పురోభివృద్ధి సాధించేందుకుగాను డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేయడం,నేడు కార్యకర్తలకు అండగా నిలవడం వంటివన్నీ తెలుగుదేశం తీసుకొచ్చిన విధానాలేనని అన్నారు. అందుకే తెలుగు ప్రజల గుండెల్లో తెలుగుదేశం ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుందని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు భారీ ఎత్తున పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
