TRINETHRAM NEWS

Telangana Government Department of Agriculture

పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

పెద్దపల్లి మండలంలోని పలు గ్రామాలలో జిల్లా వ్యవసాయ అధికారి .డి .ఆదిరెడ్డి ,సహాయ వ్యవసాయ సంచాలకులు M. శ్రీనాథ్ మండల వ్యవసాయ అధికారి మరియు వ్యవసాయ విస్తీర్ణ అధికారులు పర్యటించగా అక్కడక్కడ రైతులు తమ వరి పొలాలలో బ్యాక్టీరియా ఎండాకు తెగుళ్లు ఆశించిందని తెలుపగా వారికి బ్యాక్టీరియా ఎండాకు తెగుళ్లు నివారణకు పలు సూచనలు తెలియజేసినారు.
రాష్ట్రవ్యాప్తంగా అధిక గాలులు వీచడం మరియు వర్షాలు పడడం వలన వరి పంట పసుపు రంగుకు మారడం మరియు కొసల నుండి తెల్లటి చారలు ఏర్పడటం గమనించడమైనది. ఇలాంటి పరిస్థితులలో రైతులు ఆందోళన చెందకుండా వర్షాలు తగ్గిన తర్వాత పైపాటుగా ఎరువులు వేసినట్లయితే పంట ఆరోగ్యంగా పెరిగే అవకాశం ఉంది. అలాగే తెగుళ్లు లక్షణాలు తొలి దశలో గుర్తిస్తే నత్రజని ఎరువును తాత్కాలికంగా ఆపాలి. పంట అంకుర దశకు చేరని పొలాలలో పైపాటుగా నత్రజని మరియు పొటాష్ ఎరువును వేసుకోవాలి.
బ్యాక్టీరియా ఎండాకు తెగులు వ్యాప్తిని నివారించడానికి కాపర్ హైడ్రాక్సైడ్ 400 గ్రాములు+ స్టెప్టోమైసిన్ సల్ఫేట్ 60 గ్రాములు ఒక ఎకరానికి పిచికారి చేయాలి . తగ్గనియెడల రెండవ దఫాగా హెక్సా క్లోనజోల్ + ప్లాంటోమైసిన్ పిచికారి చేయాలి. ఆఖరి దఫాగా పొటాష్ ఎరువులను వెయ్యాలి అలాగే కాపర్ శిలీంద్ర నాశనులను పూత దశలో ఉన్న వరి పంటలో పిచికారి చేయరాదు.
కావున రైతులు ఆందోళన చెందకుండా పైన తెలిపిన మందులను పిచికారి చేసుకొని ఈ తెగుళ్లను సమర్థవంతంగా నివారించుకోవచ్చు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Telangana Government Department of Agriculture